Naga Chaitanya: నాగచైతన్య వంటి స్వీట్ అండ్ సింపుల్ లవర్‌ని అమ్మాయిలు కోరుకుంటారంటున్న హీరోయిన్

Naga Chaitanya

దక్షా నగార్కర్ (Daksha Nagarkar) గుర్తుందా? ఈ ముద్దుగుమ్మ సినిమా ద్వారా కంటే హీరో నాగచైతన్య (Naga Chaitanya)తో జరిపిన చూపుల భాషతో తెగ ఫేమస్ అయిపోయింది. బంగార్రాజు ఈవెంట్‌లో నాగచైతన్య (Naga Chaitanya), దక్షా నగార్కర్ (Daksha Nagarkar) మధ్య చూపుల భాష ఒకటి జరిగింది. ఒకవైపు స్టేజ్‌పై నాగార్జున (Nagarjuna) మాట్లాడుతుంటే.. వీరిద్దరూ అవేమీ పట్టించుకోకుండా చూపులతో మాట్లాడేసుకున్నారు. అప్పట్లో ఆ వీడియో తెగ వైరల్ అయిపోయింది. అంతేకాదు.. వీరిద్దరూ కూడా హాట్ టాపిక్‌గా మారిపోయారు.

ఇంకేముంది.. నాగచైతన్య (Naga Chaitanya), దక్షా నగార్కర్‌ (Daksha Nagarkar)ల మధ్య ఏదో నడుస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొంత కాలం పాటు వీరిద్దరూ హాట్ టాపిక్‌గా సాగారు. ఆ తర్వాత వీరిని మెల్లమెల్లగా జనాలు మరచిపోయారు. ఇక దక్షా తాజాగా చేసిన కామెంట్స్‌తో మరోసారి వీరిద్దరూ తెగ వైరల్ అవుతున్నారు. ఇంతకీ దక్షా ఏం కామెంట్స్ చేసిందంటే.. నాగ చైతన్య లాంటి స్వీట్‌ అండ్ సింపుల్ లవర్‌ని ఏ అమ్మాయి అయినా తన జీవితంలో ఉండాలని కోరుకుంటుందట. అంతటితో ఆగితే బాగానే ఉండేది.

Daksha Nagarkar about Naga Chaitanya

ఓ సినిమా రష్మిక (Rashmika Mandanna) చెబుతుందే.. స్వీట్ అండ్ హాట్ కుర్రాన్ని చూపించమని.. ఆ స్థాయిలో చెప్పింది. చైతూ చాలా కూల్ అండ్ స్మార్ట్ అని. అతడు అమ్మాయిలపై చాలా కేర్ చూపిస్తాడంటూ ఆకాశానికి ఎత్తేసింది. ఆ కేర్‌ని తాను ఫీలయ్యానంటూ దక్షా చెప్పుకొచ్చింది. షూటింగ్ లో ముద్దు పెట్టుకునే సీన్లు, కౌగిలించుకునే సన్నివేశాలు పడ్డాయట. ఆ సీన్స్ చేసిన తర్వాత తనకు చైతు సారీ చెప్పాడట. అంత స్వీట్ అబ్బాయి చైతూ అని ప్రశంసలతో ముంచెత్తింది. అయితే బంగార్రాజు ఈవెంట్‌లో చైతూని చూస్తూ సైగలు చేసిన విషయంపై మాత్రం మాట్లాడలేదు.

Google News