Nayanthara: నయనతార కవల పిల్లలు పేర్లు ఎలా ఉన్నాయో చూడండి..!

Nayantara, Vignesh Shivan kids

స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిందేమీ లేదు. ఆమె జీవితం ఒక తెరిచిన పుస్తకం. అందానికి తోడు అభినయం యాడ్ అవడంతో ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు ఎదురు లేకుండా పోయింది. సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రచార కార్యక్రమాలకు రాకున్నా కూడా దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ మాత్రం నయనతారే (Nayanthara) కావడం ఆసక్తికరం. అయితే సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించిందో రిలేషన్‌షిప్స్ విషయంలో కూడా నయన్ అంతకంటే ఎక్కువ పాపులర్ అయ్యింది.

శింబు, ప్రభుదేవా (Prabhudeva) వంటి వారితో ప్రేమాయణం తరువాత తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్‌ (Vignesh Shivan)ను నయన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే నయన్ దంపతులు పెళ్లయిన నాలుగు నెలలకే ఊహించిన ట్విస్ట్ ఇచ్చారు.  తాము సడెన్‌గా తల్లిదండ్రులమైపోయామంటూ ఇద్దరు పసికందుల కాళ్లను చూపిస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్ మామూలు సెన్సేషన్ అవలేదు. కొద్ది రోజుల పాటు ఇదే హాట్ టాపిక్. ఏకంగా నాలుగు నెలలకే సరోగసి పద్ధతి ద్వారా ఏకంగా కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారిపోయారు.

Nayantara, Vignesh Shivan

ఆసక్తికర విషయం ఏంటంటే.. నయనతార (Nayanthara), విగ్నేష్ శివన్ (Vignesh Shivan) ఎక్కడికి వెళ్లినా తమ పిల్లలను మాత్రం కెమెరా కంటికి చిక్కనివ్వరు. అంతేకాదు.. ఇప్పటి వరకూ నయనతార (Nayanthara) కవల పిల్లలకు పెట్టిన పేర్లు ఏంటి అన్న విషయం ఏంటనేది కూడా బయటకు పొక్కనివ్వలేదు. ఇక తాజాగా తమ కవల పిల్లల పేర్లను నయన్ దంపతులు స్వయంగా తమ పిల్లల పేర్లను రివీల్ చేశారు. పెద్ద కొడుకు పేరు ఉయుర్ రుద్రోనీల్ ఎన్ శివన్‌ అని.. రెండో కొడుకుకి ఉలగ్ దైవిక్ ఎన్ శివన్‌గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. మొత్తానికి ఈ జంట తామిద్దరి పేర్లను పిల్లల పేర్లలో వచ్చేలా చూసుకున్నారు. చిన్నారులిద్దరి పేర్లలో ఎన్ అంటే నయన్ అని అర్ధం.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!