Upasana Konidela: బాడీ షేమింగ్‌కు గురయ్యా .. డబ్బుల కోసమే చెర్రీ పెళ్లి చేసుకున్నాడని.. : ఉపాసన

Upasana Konidela On Body Shaming

టాలీవుడ్ స్టార్ దంపతులు రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana Konidela) పెళ్లై 11 ఏళ్లవుతుంది. మొత్తానికి తాజాగా ఒక గుడ్ న్యూస్ అయితే వెల్లడించారు. చెర్రీ తాను తండ్రి కాబోతున్నానని చెప్పి తన కుటుంబ సభ్యులకే కాదు.. అభిమానులను సైతం ఫుల్ ఖుషీ చేశాడు. ఇప్పటి వరకూ చెర్రీ, ఉపాసన (Ram Charan – Upasana)లకే కాదు.. మెగాస్టార్ చిరంజీవి సైతం ఇంటర్వ్యూల్లో చెర్రీ, ఉపాసనల గురించి ప్రశ్నలు ఎదుర్కొనేవారు. మోత్తానికి చెర్రీ, ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ను అందుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఇక తాజాగా మరో గుడ్ న్యూస్. చెర్రీ సాంగ్‌ ‘నాటు నాటు’ (Naatu Naatu)కు ఆస్కార్. దేశమంతా గర్వపడేలా ఎన్టీఆర్, చెర్రీ చేశారు. మొత్తానికి ఈ ఏడాది రామ్ చరణ్‌ (Ram Charan)కి అయితే రెండు గుడ్ న్యూస్‌లు. తాజాగా ఓ మీడియా సంస్థతో ముచ్చటించిన ఉపాసన (Upasana Konidela) తన జీవితంలో జరిగిన కొన్ని చేదు సంఘటనలను తలుచుకొని ఎంతో బాధపడింది. చెర్రీ, తాను ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నామని.. తమ పరిచయం.. స్నేహంగా.. ఆపై ప్రేమగా మారిందని ఉపాసన తెలిపారు. ఆ తరువాత పెద్దల సమక్షంలో ఒక్కటయ్యామన్నారు.

Ram Charan, Upasana Konidela

అయితే తాను పెళ్లైన కొత్తలో బాడీ షేమింగ్ గురయ్యానని ఉపాసన తెలిపారు. తాను అందంగా లేనని.. చెర్రీ (Ram Charan) తనను డబ్బు కోసమే పెళ్లాడాడంటూ రకరకాల ట్రోల్స్ తనపై వచ్చాయన్నారు. అయితే వీటి వల్ల తాను ఏరోజూ కూడా కుంగిపోలేదని తెలిపింది. నాడు తనను విమర్శించిన వారే ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారంటూ ఉపాసన తెలిపారు. నిజానికి ఉపాసన, రామ్‌చరణ్‌ల కుటుంబ నేపథ్యాలు వేరు. అయినా కూడా నమ్మకం, ప్రేమే తమను ఇప్పటి వరకూ నడిపిస్తోందని ఉపాసన తెలిపారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!