Malli Pelli: ‘మళ్లీ పెళ్లి’.. బయ్యర్స్‌కి కనీసం కాఫీకి కూడా డబ్బులు మిగల్లేదట..

మళ్లీ పెళ్లి మూవీ రివ్యూ

ఒక సినిమా జనాలను ఎంటర్‌టైన్ చేసేలా ఉండాలి. అదీకాకుండా కథ ఎప్పుడూ.. ఎక్కడా విననిది, చూడనిది అయితే మాత్రం ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే. ఎవరైనా సినిమా తీసేది డబ్బు కోసమే. అన్నీ కలిసొస్తే ఏక్ దమ్‌లో కోటీశ్వరుడై పోవచ్చని తీస్తారు. కానీ డబ్బుతో పని లేదు. నా అహాన్ని చల్లబరుచుకుంటే చాలని కోట్ల రూపాయలు వెచ్చించి సినిమా ఎవరైనా తీస్తారా? అది ఒక్క సీనియర్ నటుడు నరేష్‌కే సాధ్యం. 

నరేష్(Naresh), పవిత్రా లోకేష్‌(Pavitra Lokesh)ల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరూ వాళ్ల చేతలతో బాగా ఫేమస్ అయిపోయారు. కొంతకాలం పాటు డేటింగ్‌లో ఉండి.. ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో.. ఆపై కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌‌లో వీళ్లిద్దరూ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఏదో యంగ్ కపుల్ మాదిరిగా ఫీల్ అయిపోయి రచ్చ చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు ఇక మళ్లీ పెళ్లి అంటూ ఒక సినిమాను తీసి జనాల మీదకు వదిలారు.

Malli Pelli: ‘మళ్లీ పెళ్లి’.. బయ్యర్స్‌కి కనీసం కాఫీకి కూడా డబ్బులు మిగల్లేదట..

మళ్లీ పెళ్లి(Malli Pelli)కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని భావించామో అలాంటిదే వచ్చింది. కేవలం నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతి(Ramya Raghupathi)ని టార్గెట్ చేయడం కోసం సినిమా తీసినట్టుగా ఉంది. ఈ సినిమా తొలిరోజు దాదాపు రూ.40 లక్షలు వసూలు చేయగా.. రెండో రోజు నుంచి కేవలం వేలల్లో మాత్రమే వచ్చాయి. ఇక మొత్తంగా వచ్చిన రూ.40 లక్షల గ్రాస్ నుంచి థియేటర్ రెంట్స్, మెయింటెనెన్స్, జీఎస్టీ తీసేస్తే.. కనీసం కాఫీ కూడా కొనుక్కోలేకపోయారట బయ్యర్స్.

Google News