అంత పెద్ద హిట్ కొట్టినా యంగ్ హీరోలు దేకరే.. ఇక మళ్లీ సీనియర్సే దిక్కా?

Gopichand Malineni and Director Bobby

ఇటీవలి కాలంలో మంచి హిట్స్ కొట్టి తమను తాము నిరూపించుకున్న దర్శకుల్లో గోపిచంద్ మలినేని(Gopichand Malineni), బాబీ (Director Bobby) ఉన్నారు. గోపిచంద్ మలినేని వచ్చేసి నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna), మాస్ మహరాజ్ రవితేజ (Raviteja)లతోనూ సినిమాలు తీసి హిట్ కొట్టారు. ఇక బాబీ వచ్చే ఏకంగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)తో సినిమా చేసి హిట్ కొట్టారు. మరి ఇంత మంచి హిట్స్ కొట్టి తమను తాము నిరూపించుకున్న యంగ్ డైరెక్టర్లను ఒక్క యంగ్ హీరో కూడా దేకరే?

కారణం మరేమీ లేదు. మన యంగ్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ దర్శకుల వైపు చూడకపోవడానికి ఇదే కారణం కావొచ్చు. ఇక మళ్లీ ఈ యంగ్ డైరెక్టర్లు ఒకరి హీరో వైపు మరొకరు చూస్తున్నారు. అదేనండీ.. చిరు వైపు గోపి.. బాలయ్య (Balakrishna) వైపు బాబీ చూస్తున్నారు. ఇక వీరితో ఎలాగైనా సినిమా చేయాలనే పట్టుదలలతో ఉన్నారు. ఇద్దరూ మాస్, ఎమోషన్, యాక్షన్ కలిపి కొట్టి హిట్ పట్టారు.

అయినా వీరికి యంగ్ హీరోల నుంచి పిలుపు రాలేదు. దీంతో సీనియర్సే బెటరన్న ఆలోచనలో ఇద్దరూ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే గోపీచంద్‌కు మాత్రం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)తో సినిమా చేయాలని ఉందట. కానీ పవన్ బిజీగా ఉండటంతో అది కుదరడం లేదట. ఇక చేసేదేమీ లేక మెగాస్టార్ అదీ అవకుంటే తిరిగి రవితేజ (Raviteja)తోనే మరో సినిమా చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.