Allu Arjun ICON: అల్లు అర్జున్‌ ‘ఐకాన్’ ఛాన్స్ దిల్ రాజుకు లేనట్టా? అసలు ఐకానే ఉండదా?

Allu Arjun ICON & Dil Raju

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ‘ఐకాన్’ (Allu Arjun ICON) మూవీ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ ఆ అప్‌డేట్ ఇక ఎప్పటికీ రాకపోవచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు (Dil Raju)కు గీతా కాంపౌండ్‌కు డైరెక్టర్ పరుశురామ్ (Director Parasuram) విషయంలో తేడా కొట్టేసిందట. దీంతో అల్లు అర్జున్‌ (Allu Arjun)తో ఇకపై మూవీ కష్టమేనని ఒక టాక్.

ఇక మరో టాక్ ఏంటంటే.. ఈ సినిమా చేయాల్సిన దర్శకుడు ఇప్పటి తమిళ హీరోలు, నాచురల్ స్టార్ నాని (Nani) వెంట పడుతున్నారట. ఇక బన్నీ (Allu Arjun)తో చేయడం కష్టమేనని ప్రచారం జరుగుతోంది. ఇక ఐకాన్ మూవీ (ICON Movie) ఉండదనే వార్తలకు మరింత బలం చేకూర్చే విషయం ఏంటంటే.. మన ఐకాన్ స్టార్ (Icon Star) 2025 వరకూ ఫుల్‌గా బుక్ అయిపోయాడు. 2023 మొత్తం పుష్ప 2 (Pushpa 2)కే కేటాయించేశాడు. 2024 లో త్రివిక్రమ్ సినిమా, 2025లో సందీప్ వంగా సినిమా ఫిక్స్ అయిపోయాయి. 

Allu Arjun ICON & Dil Raju

కాబట్టి 2025 వరకూ బన్నీ ఫుల్ బిజీ. ఇక దిల్ రాజు (Dil Raju) సినిమా చేయాలంటే.. ఒకే ఒక్క ఆప్షన్ ప్రముఖ డైరెక్టర్ శంకర్. ఇప్పటికే ఒక సినిమాను శంకర్, దిల్ రాజు కాంబోలో రూపొందుతోంది. మరో సినిమా కూడా దిల్ రాజుతోనే శంకర్ చేయనున్నారని టాక్. ఇది ఓకే అయితే ‘ఐకాన్’ (ICON) ఛాన్స్ వేణు శ్రీరామ్‌కు లేనట్టే. సరే.. వేణు శ్రీరామ్ (Venu Sriram) లేకున్నా ‘ఐకాన్’ వచ్చేస్తుందా? అంటే అదీ డౌటే. ఈ సినిమా రావాలంటే శంకర్ 2026 వరకూ ఆగాల్సిందే. కానీ ఆయన ఖాళీగా ఉంటారా? అది కుదరని పని కాబట్టి ఫ్యాన్స్ ‘ఐకాన్’ను మరిచిపోవాల్సిందే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!