Anchor Shyamala: అలా లగ్జరీ హౌస్.. ఇలా మరో ఇంటికి భూమి పూజ చేసిన యాంకర్ శ్యామల.. సీక్రెట్ ఏంటంటున్న నెటిజన్లు..

Anchor Shyamala

యాంకర్ శ్యామల (Anchor Shyamala) తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. తెలుగు బిగ్‌బాస్‌తో మరింత ఫేమస్ అయిపోయింది. ఇక స్టార్ హీరోలందరినీ ఇంటర్వ్యూ చేస్తూ పాపులర్ అయ్యింది. ఇక ఈ మధ్య కాలంలో మరింత స్లిమ్ అయిపోయి ఫ్యాన్ బేస్‌ను మరింత పెంచుకుంది. ఇక శ్యామల (Anchor Shyamala) ఇల్లు దాదాపు అందరూ చూసే ఉంటారు. హోమ్ టూర్ చేసి తన ఇంటి మొత్తాన్ని అభిమానులకు చూపించింది.

ఆమె ఇల్లు చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. స్టార్ హీరోలకు తీసిపోని విధంగా కట్టుకుంది. సిటీ బయట అద్భుతంగా కట్టుకుంది. సకల సౌకర్యాలతో ఈ ఇంటిని నిర్మించుకుంది. దీని విలువ అయితే కోట్లలో ఉండవచ్చనే టాక్ నడుస్తోంది. ఇక తాజాగా భర్త, కుమారుడితో కలిసి భూమి పూజ చేస్తున్న పిక్స్‌ను సోషల్ మీడియాలో శ్యామల (Anchor Shyamala) షేర్ చేసింది. కొత్త ఇంటి గృహ ప్రవేశం చేసి ఎంతో కాలం కాకముందే ఆమె భూమి పూజ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.  

Anchor Shyamala

శ్యామల (Anchor Shyamala) భూమి పూజ తాలుకూ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.లగ్జరీ ఇల్లు కట్టి ఎంతో కాలం కాలేదని.. అప్పుడే మరో ఇల్లా అని ఆశ్చర్యపోతున్నారు. తక్కువ సమయంలో అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తోందని.. ఆ సీక్రెట్ ఏదో తమకూ చెప్పాలని అడుగుతున్నారు. మొత్తానికి శ్యామల భూమి పూజ పిక్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె అసలు ఎంత సంపాదిస్తోందనేది ఇప్పుడు ప్రధాన చర్చ. మరి నెటిజన్ల కామెంట్లపై శ్యామల ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!