వామ్మో.. ఎన్టీఆర్ ఏంటి ఇలా తయారయ్యాడు?

వామ్మో.. ఎన్టీఆర్ ఏంటి ఇలా తయారయ్యాడు?

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఊర మాస్ లుక్‌లో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటూ బయటి ప్రపంచానికి కనిపించడమే మానేశాడు. తాజాగా ఎన్టీఆర్‌కు సంబంధించిన కొన్ని పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

వామ్మో.. ఎన్టీఆర్ ఏంటి ఇలా తయారయ్యాడు?

ఎందుకంటే ఎన్టీఆర్ ఆ పిక్స్‌లో చాలా స్లిమ్‌గా కనిపిస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్, హీరో రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌లు కలుసుకున్నారు. వీరి కలయికకు బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఈవెంట్ వేదికగా మారింది. ఇక ఈ ముగ్గురికీ సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకే ఫ్రేములో ఈ ముగ్గురినీ చూసి ఫ్యాన్స్ అయితే ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆ పిక్స్‌లో ఎన్టీఆర్‌ను చూసిన వారంతా నోరెళ్లబెడుతున్నారు.

వామ్మో.. ఎన్టీఆర్ ఏంటి ఇలా తయారయ్యాడు?

చాలా స్లిమ్.. బాగా ఫిట్‌గా ఎన్టీఆర్ కనిపించాడు. ఇంతలోనే అంత మార్పును ఊహించని ఫ్యాన్స్ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏంటిరా బాబోయ్ అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ చాలా ఫ్యాటీగా ఉండేవాడు. సింహాద్రి, ఆది సినిమాలకు ఇప్పుడు సినిమాల్లో ఎన్టీఆర్‌కు అసలు పొంతనే లేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘యమదొంగ’ సినిమా కోసం ఎన్టీఆర్ స్లిమ్ అయ్యాడు. ఇక తరువాతి నుంచి మరింత స్లిమ్ అవుతూ ఇక ఇప్పుడైతే జీరో సైజ్‌లో కనిపిస్తున్నాడు.

వామ్మో.. ఎన్టీఆర్ ఏంటి ఇలా తయారయ్యాడు?
Google News