NTR30: ‘ఎన్టీఆర్ 30’.. జక్కన్న స్టైల్‌ను అనుసరించిన కొరటాల.. కథ చెప్పేశారు..
ఇద్దరు ఎన్టీఆర్‌లలో.. నాడు సీనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీని ఏలితే.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సైతం ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసి తన తరాన్ని ఏలుతున్నాడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. నాడు సీనియర్ ఎన్టీఆర్(Sr NTR).. శ్రీదేవి(Sridevi)తో జత కట్టి హిట్స్ కొడితే.. నేడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) – శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor)తో జత కడుతున్నాడు. మొత్తానికి ‘ఎన్టీఆర్ 30’ (NTR 30) ఫ్యాన్స్‌కు ఒక స్పెషల్ మూవీగా నిలవనుంది. అయితే తాజాగా ‘ఎన్టీఆర్ 30’ మూవీ లాంచ్ అయ్యింది.
ఎన్టీఆర్ 30ని కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కిస్తున్నారు. అయితే ఈసారి ఎందుకోగానీ ఆయన దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) స్టైల్‌ను అనుసరించారు. జక్కన్న తన సినిమాను ప్రకటించిన రోజే కథపై ఒక అవగాహన కల్పించేస్తారు. ఈ సారి కొరటాల శివ (Koratala Siva) కూడా అదే పని చేశారు. ఎన్టీఆర్ 30 (NTR30)ని లాంచింగ్ పూర్తయిన వెంటనే కొరటాల శివ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ 30 కథేంటో.. హీరో, హీరోయిన్‌ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయో కాస్త క్లారిటీ ఇచ్చారు.
భారతదేశ తీర ప్రాంతంలో కుట్రలు, కుతంత్రాలకు అడ్డాగా మారిపోయిందనే ఒక ఫిక్షనల్ స్టోరీ ఆధారంగా తన సినిమాను తెరకెక్కిస్తున్నట్టు కొరటాల శివ వెల్లడించారు. సాగరతీరంలో మనుషుల రూపంలో కొన్ని మృగాలు తిరుగుతూ ఉంటాయని.. వాటి అరాచకాలు పెరిగిపోయినప్పుడు ఒక వేటగాడు దిగుతాడని ఎన్టీఆర్ గురించి చెప్పేశారు. రాక్షసుల కంటే దారుణమైన ఆ మృగాలను భయపెడతాడని.. ఈ సినిమాలో సీరియస్ యాక్షన్ సీన్స్‌కు కొదువ లేదని.. కథ చాలా ఎమోషనల్‌గా సాగుతుందని.. భావోద్వేగాల మిళితంగా ఉంటుందన్నారు. జాన్వీకపూర్ రోల్ చాలా స్పెషల్ అని కొరటాల వెల్లడించారు. మొత్తానికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని ఫ్యాన్స్ ముందే లెక్కలు వేసుకుంటున్నారు.