పండుగ పూట ఫ్యాన్స్ గుండెల్లో గునపాలు దింపిన స్టార్ హీరోలు

Mahesh Babu, Ram Charan, Pawan Kalyan

ఉగాది పండుగ రోజున స్టార్ హీరోలు అభిమానుల గుండెల్లో ఏకంగా గునపాలు దింపారు. సాధారణంగా ఏదైనా పండుగ వస్తుందంటే చాలు.. తమ సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్‌ను వదిలి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే స్టార్ హీరోలు ఈసారి మాత్రం సైలెంట్ అయ్యారు. ఉరకలెత్తే ఉత్సాహంతో ఉగాది పండుగ రోజున తమ అభిమాన హీరో సినిమాకు సంబంధించి ఆశగా ఎదురు చూసిన అభిమానులకు నిరుత్సాహమే మిగిలింది.

స్టార్ హీరోలంతా ఏదో ఒక సినిమా చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఏమైందో ఏమో కానీ అప్‌డేట్ వదలడానికి మాత్రం వెనుకాడారు. ఒక్క అప్‌డేట్ కూడా లేకపోవడంతో అభిమానులంతా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హరి హర వీర మల్లు (Hari Hara Veeramallu), సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) వచ్చేసి SSMB28, యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30(NTR30), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) వచ్చేసి RC15, ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

దాదాపు స్టార్ హీరోలంతా తమ తమ సినిమాల్లో బిజీగానే ఉన్నారు కానీ విచిత్రమేమిటంటే ఇప్పటి వరకు ఈ చిత్రాలపై ఒక్క అప్‌డేట్ కూడా లేదు. ఈ స్టార్ హీరోల చిత్రాల నిర్మాతలు ఉగాది సందర్భంగా కనీసం ఒక్క అప్‌డేట్‌నైనా లైన్ చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ చేసిన పాపానే పోలేదు. టాలీవుడ్‌లోని టాప్ 6 స్టార్‌ హీరోల నుంచి అప్‌డేట్‌లు లేకపోవడంతో అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!