Samantha: సమంత ఈజ్ బ్యాక్.. స్టైలిష్ లుక్‌తో కుర్రకారుకు హీటో పెంచేస్తోందిగా..

Samantha Ruth Prabhu

‘ఏం మాయ చేశావే’ (Yem Maya Chesave) చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగేందుకు సమంత(Samantha)కు పెద్దగా సమయం పట్టలేదు. ఇక ఇప్పుడు అయితే ఆమె రేంజే వేరు. ఒకవైపు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు.. మరోవై బాలీవుడ్ ఎంట్రీ.. ఇక త్వరలోనే పాన్ ఇండియా సినిమాల్లో మెరవబోతోంది. అంతా బాగుందనుకున్నా కానీ అమ్మడికి ఎందుకో లైఫ్‌లో మాత్రం సుఖం లేకుండా పోయింది.

Samantha Ruth Prabhu

పెళ్లి తర్వాత గ్లామర్ డోస్‌ను బీభత్సంగా పెంచేసి బాగా ట్రోల్ అయ్యింది. అది చాలదన్నట్టు హీరో నాగచైతన్య (Naga Chaitanya) సైతం ఆమెకు విడాకులు ఇచ్చేసి సైడ్ అయిపోయాడు. ఈ విషయంలోనూ సమంత (Samantha) పైనే బీభత్సంగా ట్రోల్స్ వచ్చాయి. చెప్పినా వినలేదని టాక్ నడిచింది. మ్యారీడ్ లైఫ్ కంటే కెరీర్ ముఖ్యమనుకుందని సమాచారం. మొత్తానికి నాగచైతన్య (Naga Chaitanya)తో విడాకుల తర్వాత ఫ్రీ బర్డ్ అయిపోయింది. కానీ మయోసైటిస్ వ్యాధి కొన్నాళ్లపాటు ఆమెను వేధించింది.

Samantha Ruth Prabhu

మయోసైటిస్ వ్యాధి మాటేమో కానీ సామ్ మళ్లీ సైలెంట్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఆమె (Samantha) మీడియాను కానీ.. సోషల్ మీడియాను కానీ ఫేస్ చేసింది లేదు. తాజాగా మాత్రం ఫ్యాన్స్‌కి స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చింది. సామ్ (Samantha) చాలా సెక్సీగా ఉందంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. చాలా స్టైలిష్‌గా కనిపించి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది. ఇప్పుడు ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి పిక్స్‌ను చూసిన వారంతా సమంత (Samantha) ఈజ్ బ్యాక్ అంటున్నారు.

Google News