‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

'లాల్‌ సలాం'లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

సూపర్‌స్టార్ రజినీకాంత్ ఈ వయసులోనూ తన హవా కొనసాగిస్తున్నారు. రజినీ ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. భాషలతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక రజినీ నటించిన లాల్ సలాం సినిమా ఫిబ్రవరి 9వ తేదీన విడుదల కానుంది. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈసినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో రజినీకాంత్ గెస్ట్ రోల్‌లో నటించనున్నారు. ఈ సినిమాలో రజినీ కేవలం అరగంట మాత్రమే కనిపిస్తారట. అరగంట అయినా కూడా రజినీ రోల్ సినిమాలో చాలా వెయిట్ ఉన్న పాత్ర. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు సూపర్ స్టార్ ఈ పాత్ర కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ పాత్ర ట్రెండింగ్‌గా నిలుస్తోంది.

'లాల్‌ సలాం'లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

ఈ సినిమాలో మొయినుద్దీన్ అనే పాత్రలో రజినీ నటిస్తున్నారని టాక్. ఇక ఈ సినిమాలో 30 నిమిషాల పాత్రకు గానూ రజినీ రూ.40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఏడు పదుల వయసులో సైతం రజినీ ఈ రేంజ్‌లో పారితోషికం తీసుకుంటున్నారని తెలిసి అవాక్కవుతున్నారు. ఇక రజినీ అప్‌కమింగ్ చిత్రాలన్నీ కూడా ఓ రేంజ్‌లో ఉంటాయని టాక్.