Game Changer: ‘గేమ్ చేంజర్’ విడుదల అప్పుడేనట..

గేమ్ చేంజర్’ విడుదల అప్పుడేనట..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘గేమ్ చేంజర్’. ఈ సినిమా కోసం చెర్రీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకూ సినిమాపై పాజిటివ్ హైప్ అయితే క్రియేట్ కాలేదనే చెప్పాలి. ఇటీవల చెర్రీ బర్త్ డే సందర్భంగా విడుదలైన సాంగ్‌పై కూడా జనం పెదవి విరిచారు. రూ.18 కోట్లు ఖర్చు పెట్టి తీసిన పాట ఇదా? అని ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇక సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలం అవుతున్నా కూడా రిలీజ్ డేట్‌పై మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. శంకర్ గేమ్ చేంజర్‌తో పాటు ఇండియన్ 2 మూవీపై కూడా ఇంట్రెస్ట్ పెట్టడంతో సినిమా విడుదల తేదీ ఆలస్యమవుతోందని టాక్. ఇక దిల్ రాజు అయితే రిలీజ్‌కి సంబంధించిన విషయాన్ని పూర్తిగా శంకర్ చేతిలోనే పెట్టారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్‌పై నెట్టింట ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.

Game Changer 020424

ప్రస్తుతానికి ఇలాగే షూటింగ్ కొనసాగితే మాత్రం జూలై నాటికి పూర్తవుతుంది. ఆపై పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ కోసం కొంత సమయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే సినిమా విడుదలకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు మాత్రమే అనుకూలమని భావిస్తున్నారట. అక్టోబర్ రెండో వారం తర్వాత ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం ఉందట. అక్టోబర్ 10న ‘దేవర’ రిలీజ్ ఉండటంతో అప్పుడు గేమ్ చేంజర్‌ను విడుదల చేయరట. ఇక ఆ తరువాతి నుంచి ఎప్పుడైనా విడుదల తేదీని ఫిక్స్ చేయవచ్చని టాక్. 

Google News