Anchor Rashmi: సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడానికి కారణమేంటో చెప్పిన రష్మి

Anchor Rashmi: సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడానికి కారణమేంటో చెప్పిన రష్మి

రష్మీ గౌతమ్(Anchor Rashmi Gautam).. యాంకర్‌గా అమ్మడి హవా మామూలుగా లేదు. యాంకర్ సుమ(Suma), అనసూయ(Anasuya) తర్వాత ఆ స్థాయిలో రాణిస్తోంది. జబర్దస్త్ ద్వారా యాంకర్‌గా ప్రేక్షకులకు బాగా దగ్గరైన రష్మి ఇక ఇప్పుడు చాలా షోస్ చేస్తోంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌(Sudigali Sudheer)తో కలిసి ప్రేక్షకులను మెప్పించడం కోసం ఆమె నడిపిన ప్రేమ వ్యవహారంతో మరింత పాపులర్ అయిపోయింది. సుధీర్‌కి రష్మి మాత్రమే సరిజోడు అని ప్రేక్షకులు తేల్చేశారు.

అయితే ఎందుకోగానీ అనసూయ(Anchor Anasuya) మాదిరిగా రష్మి(Rashmi) వెండితెరపై హైలైట్ అవలేకపోయింది. దీనికి కారణం లేకపోలేదు. అనసూయ(Anasuya) క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన సత్తాను చాటింది. కానీ రష్మి అలా కాదు. ఏకంగా హీరోయిన్ అయిపోవాలనుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు వచ్చిన అవకాశాలు పెద్దగా జనాల్లోకి తీసుకెళ్లలేకపోయాయి. ఫైనల్‌గా రష్మి(Anchor Rashmi) కెరీర్ కొలాప్స్ అయిపోయింది. ఇక బుల్లితెరకే పరిమితమైంది.

Anchor Rashmi: సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడానికి కారణమేంటో చెప్పిన రష్మి

కాగా.. శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama Company)లో మాతృదినోత్సవం సందర్భంగా రష్మి(Anchor Rashmi) చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాంకర్‌గా అంత మంచి నేమ్ ఫేమ్ సంపాదించుకున్న రష్మి.. సినిమాల్లో ఎందుకు రాణించలేదని ఇంద్రజ(Indraja) ప్రశ్నించారు.

దీనికి ఓపెన్‌గా సమాధానం చెప్పాలని కోరడంతో సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క క్యారెక్టర్‌కు ఎవరు చేయాలన్న నిర్దేశం ఉంటుందని.. చెల్లి పాత్రలు, తల్లి, హీరోయిన్ సైతం కొందరికే అవకాశాలొస్తాయని తెలిపింది. ఆడియన్స్ రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా ముఖ్యమని రష్మి తెలిపింది.

Google News