Rajamouli: మనవళ్లు, మనవరాళ్లతో సినిమా చూడాలా?: రాజమౌళిపై మీమ్సే మీమ్స్
దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli)పై సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. మీమ్స్ అయితే లెక్కే లేదు. దీనికి కారణం లేకపోలేదు. ఇంతకు ముందులా లేదు ఇప్పుడు. సోషల్ మీడియా యమ యాక్టివ్ అయిపోయింది. ఇంతకు ముందు కార్టూన్ల రూపంలో ఏదైనా సెటైరికల్‌గా చెప్పేవాళ్లు. ఇప్పుడు కాలం మారింది కదా.. మీమ్స్ రూపంలో రచ్చ చేస్తున్నారు. ఈ మీమ్స్2కు నెటిజన్లు సైతం బాగా అడిక్ట్ అవుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. అందరి సినిమాలు ఒక ఎత్తు.. రాజమౌళి(Rajamouli) సినిమాలు ఒక ఎత్తు. ఆయన కెరీర్‌లోనే ఇంతవరకూ ఫ్లాప్ అనేది లేదు. దీనికి కారణాలు లేకపోలేదు. ఆయన కథ విషయంలో కానీ.. మేకింగ్ విషయంలో కానీ అస్సలు కాంప్రమైజ్ అవరు. విపరీతంగా కష్టపడతారు. ఇక ఆ సినిమాలో నటిస్తున్న నటీనటులను కష్టపెడతారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో రాజమౌళి హీరోలు ఈ విషయాన్ని చెప్పారు.
ఇక ఆయన ఒక్కో సినిమాకు తీసుకునే సమయం కూడా ఇతర దర్శకులతో పోలిస్తే చాలా ఎక్కువ. బాహుబలి(Bahubali) రెండు పార్టులకు కలిపి ఆయన ఐదేళ్ల సమయం తీసుకున్నారు. ఇక ఆర్ఆర్ఆర్(RRR Movie) విషయానికి వస్తే.. నాలుగేళ్లు పట్టింది. అయితే ఈ సినిమాకు కరోనా కూడా దెబ్బేసింది. ఇక తాజాగా రాజమౌళి(Rajamouli) మహాభారతం(Mahabharatam) తీస్తానని దీనిని 10 పార్టుల్లో తెరకెక్కిస్తానని ప్రకటించారు. ఒక్క సినిమా తీయాలంటే మినిమమ్ రెండేళ్లు తీసుకునే రాజమౌళి ఈ 10 పార్టులకు తీసుకునే సమయంపై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇక తామంతా పదో పార్టును మనవళ్లు, మనవరాళ్లతో చూడాల్సి వస్తుందని.. అప్పటికి రాజమౌళి(Rajamouli)తో పాటు హీరోలంతా ముసలోళ్లయిపోతారంటూ మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి.