Ravanasura Public Talk: రవితేజకు మరో హిట్ ఫిక్స్ అయినట్టేనా? ప్రేక్షకులు ఏమంటున్నారు?

Ravanasura Public Talk

మాస్ మహారాజ రవితేజ (Raviteja) వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ధమాకా(Dhamaka), వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) సినిమాలతో హిట్స్ అందుకున్న రవితేజ ఇప్పుడు రావణాసుర (Ravanasura) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్‌డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. మరి అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఉందా? ఊరించి ఉసూరుమనిపించిందా?

Ravanasura Public Talk

కామెడీ, థ్రిల్లర్ నేపథ్యంలో రావణాసుర (Ravanasura Movie) మూవీ రూపొందింది. కామెడీ అండ్ థ్రిల్లర్ సమపాళ్లలో కలిపి వడ్డించాడట దర్శకుడు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, డీసెంట్స్ సాంగ్స్‌తో నడిపించాడని నెటిజన్లు చెబుతున్నారు. నెగిటివ్ షేడ్స్‌తో కూడిన మంచి ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ను ప్రేక్షకులకు అందించాడట సుధీర్ వర్మ. ఇక సెకండ్ హాఫ్ మొత్తం పాజిటివ్ వైబ్స్‌తో చక్కగా డిజైన్ చేసి సినిమాను నడిపించారని కొందరు ప్రేక్షకులు చెబుతున్నారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రవితేజను అద్భుతంగా చూపించారట.

Ravanasura Public Talk

ఇక ఈ సినిమాలో విలన్‌గా నటించిన సుశాంత్ (Sushanth) పాత్ర కూడా హైలైట్‌గానే ఉందట. అతని నటనకు మంచి మార్కులే పడుతున్నాయి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్‌లను దర్శకుడు నడిపించిన తీరు చాలా బాగుందని టాక్. మొత్తానికి ఈ సినిమా రవితేజ (Raviteja) ఖాతాలోకి మరో హిట్‌ను జత చేసినట్టేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఓ డైలాగ్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘కంచం ముందుకి మంచం మీదకి ఆడపిల్లలు పిలవగానే రావాలి.. లేకపోతే నాకు మండుద్ది రా’ అంటూ రవి తేజ (Raviteja) చెప్పిన డైలాగ్‌పై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

రావణాసుర చిత్రానికి మీరిచ్చే రేటింగ్ ?

  • సూపర్ హిట్ - 4/5 (36%, 4 Votes)
  • బాగుంది - 3/5 (27%, 3 Votes)
  • జస్ట్ ఒకే - 2.5/5 (18%, 2 Votes)
  • అస్సలు బాగోలేదు - 1/5 (18%, 2 Votes)
  • బాగోలేదు - 2/5 (0%, 0 Votes)

Total Voters: 11

Loading ... Loading ...
Google News