Naga Chaitanya: కాలేజీలో మల్లారెడ్డిని పెట్టుకుని.. బయట నుంచి సెలబ్రిటీలు అవసరమా?: నాగ చైతన్య..
కాలేజీలో పెద్ద సెలబ్రిటీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy)ని పెట్టుకుని బయట నుంచి సెలబ్రిటీలు అవసరమా? అని హీరో నాగ చైతన్య మల్లారెడ్డి కళాశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రశ్నించారు. తాజాగా హైదరాబాద్‌లోని సీఎంఆర్ కాలేజ్ (CMR College) వార్షికోత్సవ వేడుకలకు నాగ చైతన్య (Naga Chaitanya) హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లారెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా డైలాగుల కంటే మీ స్పీచ్‌లే ఎక్కువ ఫేమస్ అవుతున్నాయని మల్లారెడ్డిను ఉద్దేశించి నాగచైతన్య(Naga Chaitanya) వ్యాఖ్యానించాడు.
మల్లారెడ్డి (Mallareddy) చెప్పినట్టు ఎప్పుడూ గివ్ అప్ ఇవ్వొద్దని విద్యార్థులకు చై తెలిపాడు. మల్లారెడ్డి (Minister Mallareddy) ఒక ఇన్‌స్పైరింగ్ పర్సన్ అని.. ఆయన ఎంతో కష్టపడి.. ఇవాళ ఈ స్థాయికి వచ్చారన్నాడు. ఆ జర్నీ వెనకలా ఎంత కష్టముందో ఆయనకే తెలుసని… అవన్నీ ఆయన స్పీచ్‌ల ద్వారా మనం విన్నామని.. ఆయన చెప్పినట్టు గివ్ అప్ ఇవ్వొద్దని విద్యార్థులకు చై తెలిపాడు. లైఫ్‌లో స్పీడ్ బ్రేకర్స్ కామన్ అని.. వాటిని పట్టించుకోవద్దని.. మీ పని మీరు చేసుకుంటూ వెళ్లాలని చై తెలిపాడు.
ఒక్క చదువులోనే కాకుండా పర్సనల్, ప్రొఫెషనల్, లవ్.. లైఫ్‌లో ఏదైనా సరే.. గోల్ సెట్ చేసుకుని ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తూ గమ్యం వైపునకు పరుగులు తీయాలని చై సూచించాడు. ఫ్రైడే వస్తే చాలు.. హీరోల జాతకాలు మారిపోతాయన్నాడు. ఫ్లాప్ వస్తే.. హిట్ కోసం పరుగులు.. హిట్ వస్తా.. నెక్ట్స్ పెద్ద హిట్ కోసం పరుగులు తీస్తూ ఉంటామన్నాడు. కస్టడీ సినిమా ట్రైలర్ నచ్చిందా? అని విద్యార్థులను ప్రశ్నించాడు. ట్రైలర్ నచ్చితే సినిమా కూడా నచ్చినట్టేనన్నడు. మే 12న కస్టడీ సినిమాను థియేటర్లలో వచ్చి చూడాలని కోరారు.