NTR Fans: హృతిక్‌తో బాలీవుడ్‌లో మల్టీ స్టారర్ మూవీ చేయనున్న ఎన్టీఆర్.. ఆందోళనలో ఫ్యాన్స్..

NTR, Hrithik Roshan

ప్రస్తుతం సౌత్‌లో మల్టీస్టారర్ల హవా నడుస్తోంది. తాజాగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా (RRR Movie) సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు భారత్‌కు ఆస్కార్‌ను అందించి రికార్డ్ సాధించింది. దీంతో ఒకప్పుడు మన నటీనటులను చిన్నచూపు చూసిన బాలీవుడ్ యాక్టర్లు సైతం మన వాళ్లతో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా నిజానికి రాజమౌళిదే. తెలుగు సినిమా గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR) హీరో బాలీవుడ్‌ను ఏలేందుకు సిద్ధమవుతున్నాడు.

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ‘వార్’ (War) సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉంది. అయితే మన యంగ్ టైగర్ బాలీవుడ్‌లో సినిమా చేసేంత వరకూ ఓకే కానీ బాలీవుడ్ వారు మనకు అంత ప్రియారిటీ ఇస్తారా? అని ఫ్యాన్స్ తెగ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే.. ఇప్పుడిప్పుడు పరిస్థితులు కాస్త మారాయి కానీ నిన్న మొన్నటి వరకూ మరోలా ఉండేవి.

సౌత్ ఇండియన్ సినిమాలను కేవలం ప్రాంతీయ సినిమాలుగానే బాలీవుడ్ వారు చూసేవారు. ఒక వాల్యూ అంటూ ఉండేది కాదు. రాజమౌళి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పాన్ ఇండియా మూవీస్ చేయడం ప్రారంభించాక సీన్ మారిపోయింది. హిందీ కంటే గొప్పగా సౌత్ ఇండియన్ సినిమాలు సక్సెస్ అవడం మొదలుపెట్టాయి. వెయ్యి కోట్ల క్లబ్‌లో సౌత్ ఇండియన్ సినిమాల చేరికతో కాస్త మనపై గౌరవం పెరిగింది. కాబట్టి ఎన్టీఆర్‌ను మాత్రం తక్కువ చేసే అవకాశం లేదు. తమకు సౌత్ ఇండియన్ మూవీస్, స్టార్స్‌పై ఎలాంటి అభిప్రాయం ఉన్నా కూడా ప్రస్తుత తరుణంలో మాత్రం బయటపెట్టరు. మన ఎన్టీఆర్‌ (NTR)కి తగిన గౌరవం దక్కుతుందనడంలో సందేహం లేదు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!