RP Patnaik: మహేష్‌కు పాట పాడి తప్పు చేశా : ఆర్పీ పట్నాయక్

Music Director RP Patnaik about Mahesh Babu

మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ (RP Patnaik) తెలియని వారుండరు. ఒక్కసారిగా ఏదో ప్రభంజనంలా ప్రేక్షకుల మనసుల్లోకి దూసుకువచ్చారాయన. ‘చిత్రం’ (Chitram) సినిమాతో ఫేమస్ అయ్యి.. ఆపై

‘మనసంతా నువ్వే’(Manasantha Nuvve), ‘నువ్వే నువ్వే’(Nuvve Nuvve), ‘జయం’ (Jayam), ‘నీ స్నేహం’ (Nee Sneham) వంటి సినిమాల ద్వారా బాగా పాపులర్ అయిపోయారు. యూత్ అయితే ఆయనకు బాగా కనెక్ట్ అయిపోయారు. ఆయన ఏం పాటిచ్చినా పెద్ద సంచలనంగా మారిపోయేది. 2016 వరకూ ఆయన అప్రతిహత హవాను ఆర్పీ పట్నాయక్ (RP Patnaik) కొనసాగించారు.

ఎన్నో పాటలు పాడుతూ ప్రేక్షకులను ఆర్పీ పట్నాయక్ అలరించారు. ఆయన ప్రతిభకు నేమ్ – ఫేమ్‌తో పాటు పురస్కారాలు సైతం పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే ఆ తర్వాతి నుంచి ఏమైందో కానీ ఆయన మ్యూజిక్ కంపోజ్ చేయడం మానేశారు. సినిమాలు తగ్గాయో.. లేదంటే ఆయనే తగ్గించారో కానీ ఇండస్ట్రీ వైపు పెద్దగా చూసింది లేదు. అయితే ఒక షోలో మాత్రం జడ్జిగా అలరించారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను ఆర్పీ పట్నాయక్ (RP Patnaik) పంచుకున్నారు.

Mahesh Babu in Nijam Movie

అయితే తన కెరీర్ మొత్తం మీద మహేష్ బాబు (Mahesh Babu)కు పాట పాడినందుకు చాలా రిగ్రెట్ ఫీలయ్యానని ఆర్పీ పట్నాయక్ తెలిపారు. ‘నిజం’ (Nijam) మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసే సమయంలో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల సింగర్ ఉష (Singer Usha)తో కలసి తాను ఎక్కువగా పని చేయాల్సి వచ్చిందన్నారు. నిజం సినిమాలో మహేష్‌ (Mahesh Babu)కు తన వాయిస్ అస్సలు సెట్ కాలేదన్నారు. చిన్న పిల్లాడి గొంతు మాదిరిగా ఉండటంతో తాను ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. స్టార్ హీరోకు పాడాల్సిన గొంతు తనది కాదని.. చాలా మంది ఆ సమయంలో చెప్పారన్నారు. అవకాశం వచ్చింది కదాని ఎవరికి పడితే వారికి పాడేస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని ఆర్పీ పట్నాయక్(RP Patnaik) వెల్లడించారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!