Saraswathi: చెర్రీతో అలా స్నేహం ఏర్పడిందో చెప్పిన సమరసింహారెడ్డిలో నటించిన సరస్వతి

Samara Simha Reddy Saraswathi about friendship with Ram Charan

నందమూరి బాలకృష్ణ (Balakrishna) బ్లాక్ బస్టర్ హిట్స్‌లో ముందుగా గుర్తొచ్చేది.. ‘సమరసింహారెడ్డి’ (Samarasimha Reddy). అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సేషనే క్రియేట్ చేసింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్స్ ట్రెండ్ కి తెరలేపిన చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి మరీ దూసుకెళ్లింది. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.16 కోట్ల షేర్ వసూల్‌తో దుమ్మురేపింది. ఫ్యాక్షన్, సెంటిమెంట్‌ను దర్శకుడు కలిపి కొట్టడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.

తన చెల్లెళ్ల కోసం బాలయ్య పడే తపన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఇక చెల్లెళ్లలో ముఖ్యంగా సరస్వతి (Saraswathi) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. బాలయ్య బాబు చిన్న చెల్లిగా ఫిజికల్లీ హ్యాండ్ కాప్డ్ క్యారెక్టర్‌లో సరస్వతి నటించింది. ఈ పాత్ర పోషించిన అమ్మాయి పేరు సహస్ర. ఈ ఒక్క సినిమాలోనే చాలా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరై పోయింది కాబట్టి సహస్రను అప్పటి ప్రేక్షకులు ఎవరూ మరువలేరు. ప్రస్తుతం ఈ అమ్మాయి బిజినెస్‌లో రాణిస్తోంది.

తాజాగా సహస్ర ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. వాటిలో ఒకటి మెగా ఫ్యామిలీతో పాటు రామ్ చరణ్‌తో తనకున్న అనుబంధం. చిన్నప్పుడు ఈ అమ్మాయి చాలా క్యూట్‌గా ఉండేది కదా.. అందుకే తనను అంతా బాగా చూసుకునే వారట. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో రౌడీ అల్లుడు (Rowdy Alludu) అనే సినిమా చేసింది. ఆ సమయంలో చిరు తనను ఇంటికి తీసుకెళ్లేవారట. అక్కడ రామ్ చరణ్‌ (Ram Charan)కి సంబంధించిన టెడ్డీ బేర్‌తో ఆడుకునేదట. అలా చెర్రీతో తనకు స్నేహం కుదిరిందని. ఇప్పటికే చెర్రీ తనకు బెస్ట్ ఫ్రెండేనని.. అప్పడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటామని సహస్ర తెలిపింది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!