Sridevi: అప్పట్లో శ్రీదేవిని పెళ్లి చేసుకోమంటూ ఆమె తల్లి అంత మంది హీరోలను అర్థించారా?

Heroine Sridevi

లెజెండరీ నటి శ్రీదేవి (Sridevi) అనగానే మనకు అందానికి అతిలోక సుందరి.. నటనలో క్వీన్.. ఇవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ramgopal Varma) అయితే ఆమెను ఆరాధించేవారు. ఆమెతో నటించేందుకు హీరోలు సైతం పోటీ పడ్డారు. బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన శ్రీదేవి(Sridevi).. పెద్ద సమయం తీసుకోకుండానే హీరోయిన్‌గా నటించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో క్వీన్‌లా వెలుగొందింది. మనవరాలిగా నటించిన హీరో సరసనే ఏకంగా హీరోయిన్‌‌గా నటించింది. 

ఇక శ్రీదేవి(Sridevi) అప్పుడే కాదే.. ఇప్పటి హీరోయిన్స్‌కి కూడా రోల్ మోడలే. పలువురు హీరోలకి ఆమె ఫేవరెట్ హీరోయిన్. అయితే ఈ అతిలోక సుందరి గురించి ప్రస్తుతం ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శ్రీదేవి తల్లి ఆమె పెళ్లి కోసం నానా తిప్పలు పడ్డారట. ఎన్నో పెళ్లి సంబంధాలు చూశారట. ఎందరో హీరోలను శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని అడిగారట. ఈ వరుసలో కోలీవుడ్, టాలీవుడ్ హీరోలు కూడా ఉన్నారట. కానీ వాళ్లంతా ఏవేవో కారణాలు చెప్పి పెళ్లి తప్పించుకున్నారని టాక్.

Heroine Sridevi

అప్పట్లో శ్రీదేవి(Sridevi) పెళ్లి వార్త పెద్ద హైలైట్ అట. అతిలోక సుందరి ఏంటి? ఆమెను పెళ్లి చేసుకోవడానికి హీరోలు మొహం చాటేయడమేంటి? అని ఆశ్యర్యం వేస్తోంది కదా. ఇక శ్రీదేవి తల్లి తన కుమార్తె కోసం సంప్రదించిన వారిలో రాజశేఖర్ (Rajasekhar), జేడీ చక్రవర్తి (JD Chakravarthy), అరవింద్ స్వామి(Aravind Swamy), కమల్ హాసన్ (Kamal Haasan) పలువురు హీరోలు కూడా ఉన్నారు. అరవింద్ స్వామి అయితే తనకంటే శ్రీదేవి(Sridevi) పెద్దదని తప్పించుకున్నారట. ఇక కమల్ హాసన్ అయితే తనను మీ కూతురు భరించలేదని.. తనను తట్టుకోలేక శ్రీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసి కూర్చుంటుందని చెప్పారట. ఇక ఆ తర్వాత కొన్నేళ్ళకు బాలీవుడ్ అగ్ర నిర్మాత బోణి కపూర్ (Boney Kapoor) తో ప్రేమాయణం నడిపి, పెళ్లి చేసుకొని బాలీవుడ్‌లోనే శ్రీదేవి(Sridevi) స్థిరపడిపోయారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!