కేవలం ఆ కారణంగానే కిరణ్ రాథోడ్ ఎలిమినేట్

కేవలం ఆ కారణంగానే కిరణ్ రాథోడ్ ఎలిమినేట్

గత సీజన్లు వేరు.. ఇప్పుడు వేరని.. బిగ్‌బాస్ షో చూసిన వారికైతే అర్థమవుతుంది. ఇక తొలివారం ఎలిమినేషన్ ప్రోగ్రాం పూర్తైంది. ఈ వారం మాత్రం బిగ్‌బాస్ నిర్వాహకులు చాలా జెన్యూన్‌గా ఎలిమినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వారం హౌస్ నుంచి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. నిజానికి తెలుగు ఏమాత్రం రాని వారిని బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించడమే పెద్ద తప్పు. ఆపై వారు ఏం మాట్లాడుతున్నారో కింద తెలుగులో స్క్రోలింగ్ ఇవ్వడం మరీ దారుణం.

తెలుగు సెలబ్రిటీలు ఇందరు ఉండగా.. ఏమాత్రం తెలుగురాని వారిని తీసుకురావడం ఏంటో నిర్వాహకులకే తెలియాలి. ఈసారి తెలుగు అస్సలు రాని వాళ్లు హౌస్‌లో ఇద్దరు ఉన్నారు. కిరణ్ రాథోడ్, ప్రిన్స్ యావర్. వీరిద్దరికీ లీస్ట్ ఓట్లు పడ్డాయి. ఈ వారం ఓటింగ్ చూస్తే.. టాప్ నుంచి వరుసగా రతిక, గౌతమ్ కృష్ణలకు ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత దామిని ఉంది.. ఇక నెక్ట్ పల్లవి ప్రశాంత్, షకీలా, శోభాశెట్టి, ప్రిన్స్ యవార్, కిరణ్ ఉన్నారు.

కేవలం ఆ కారణంగానే కిరణ్ రాథోడ్ ఎలిమినేట్

అందరికంటే కిరణ్‌కు అత్యంత తక్కువ ఓటింగ్ జరగడంతో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిపోయింది. ఆమె హిందీ లేదంటే ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ కనిపించింది. అసలు ఏమాట్లాడుతోందో కూడా అర్థం కానీ ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. పైగా ఎందుకోగానీ కిరణ్ ఎక్కడా కూడా ఈ వారం మొత్తం మీద హైలైట్ అయ్యింది లేదు. మరి ఆమెకు స్క్రీన్ స్పేస్ దక్కలేదో లేదంటే సైలెంట్ అయిందో తెలియలేదు. ప్రిన్స్ యావత్ వీరి భాష, వ్యవహారశైలి కూడా ఎవరికీ అర్థం కాలేదు.