అక్కడ అడుగు పెట్టగానే కళ్లలో నీళ్లు తిరిగాయి: అనుష్క

అక్కడ అడుగు పెట్టగానే కళ్లలో నీళ్లు తిరిగాయి: అనుష్క

అనుష్క.. 2018 వరకూ ఫుల్ బిజీ హీరోయిన్. వరుస సినిమాలు.. క్షణం తీరిక లేకుండా గడిపేసింది. ఆ తరువాత ఏమైందో కానీ నిశ్శబ్దం మూవీ తర్వాత కెరీర్‌లో కూడా అనుష్క సైలెంట్ అయిపోయింది. చాలా పెద్ద బ్రేకే తీసుకుంది. ఒక నటి జీవితంతో ఐదేళ్ల గ్యాప్ అంటే దాదాపు కెరీర్‌ క్లోజే. కానీ అనుష్కకు ఉన్న క్రేజ్‌తో ఆ గ్యాప్ తర్వాత కూడా మళ్లీ అవకాశం దక్కింది.

అయితే ఆ బ్రేక్ తీసుకోవడానికి కారణంపై అనుష్క ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాహుబలి, రుద్రమదేవి, సైజ్‌ జీరో. భాగమతి వంటి సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేశానని.. అందుకే కాస్త బ్రేక్ తీసుకోవాలని అనుకున్నట్టు తెలిపింది. అయితే ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఏనాడూ బాధపడలేదట. తనకు ఈ బ్రేక్ అవసరమని మాత్రమే భావించిందట. 

ఇక బ్రేక్ తర్వాత తొలిసారిగా షూటింగ్‌కు వెళ్లిన సమయంలో కారవాన్‌లో అడుగు పెట్టినప్పుడు అనుష్కకు కళ్లలో నీళ్లు తిరిగాయట. తన జీవితంతో తన రెండో ఇల్లు వచ్చేసి కారవానే అని అనుష్క తెలిపింది. బ్రేక్ తర్వాత షూటింగ్‌కు వెళ్లినప్పుడు తాను షెడ్యూల్స్ ఎంత మిస్ అయ్యాననేది అర్ధమైందట. నిజానికి సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి తాను చెప్పిన విషయం బాగా అర్థమవుతుందని వెల్లడించింది.

ఇవీ చదవండి:

బిగ్‌బాస్ తెలుగు 7.. బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్న నిర్వాహకులు

నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు.. క్రిటికల్ కండీషన్‌లో ఉన్నా: గాయత్రి గుప్తా

నా కొడుకును బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నాడు: విజయ్ దేవరకొండ తండ్రి సంచలనం

జైలు సెంటిమెంటు పెట్టు.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టు..

ఇండస్ట్రీకి ఓపెన్ వార్నింగ్ ఇచ్చిన ఐ బొమ్మ..

శుభశ్రీ.. ఏకంగా ఒక్క వీడియోతో పవన్ ఫ్యాన్స్‌కే గాలం వేసిందిగా..