జైలు సెంటిమెంటు పెట్టు.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టు..

Jawan Sentiment

ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో చెప్పడం కష్టం. ఆ మధ్య కాకి సైతం సెంటిమెంటుగా మారిన విషయం తెలిసిందే. ఆ తరువాత తెలంగాణ యాస సెంటిమెంట్ నడిచింది. ఇప్పుడు ఇండస్ట్రీలో జైలు సెంటిమెంట్ గట్టిగా వినిపిస్తుంది. బాక్సాఫీస్‌ను ఈ సెంటిమెంట్ ఊపేస్తోంది. గత నెల ఆగస్ట్‌లో విడుదలైన జైలర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ఇప్పుడు మరో సినిమా జైలు సెంటిమెంటుతో షేక్ చేస్తోంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందిన జవాన్ సినిమాలోను జైలు ఎపిసోడ్ కీలక పాత్ర పోషించినట్లు టాక్ వినిపిస్తుంది. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో షారుఖ్ జైలులో జన్మిస్తాడు. అక్కడి నుంచి కథ మొదలవుతుంది. ఈ జైలు సెంటిమెంట్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. మొత్తానికి ఈ చిత్రం తొలిరోజే బీభత్సమైన వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేసింది.

‘జవాన్‌’ రెస్పాన్స్ ఏంటో తెలిస్తే షాక్ అవడం ఖాయం..

ఆల్రెడీ ఫస్ట్ డే ప్రీమియర్స్‌తోనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కనీసం ఒక్క మైనస్ పాయింట్ కూడా ఏ రివ్యూవర్ నుంచి కానీ ప్రేక్షకుల నుంచి కానీ రాకపోవడం విశేషం. జవాన్.. షారుఖ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కాబోతుందని అంచనా. జైలు సెంటిమెంటుతో రూపొందిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఇక నుంచి ఈ ట్రెండ్ నడుస్తుందేమోనని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

ఇవీ చదవండి:

ఇండస్ట్రీకి ఓపెన్ వార్నింగ్ ఇచ్చిన ఐ బొమ్మ..

శుభశ్రీ.. ఏకంగా ఒక్క వీడియోతో పవన్ ఫ్యాన్స్‌కే గాలం వేసిందిగా..

మహేష్ కోసం రంగంలోకి దిగిన పవన్..

విజయ్ దేవరకొండ – రష్మికలను పట్టిచ్చిన పిట్టగోడ.. నెటిజన్లు షాక్..

శెట్టి జంట ఇరగదీశారట.. బొమ్మ బ్లాక్ బస్టరేనట..

‘జవాన్‌’ రెస్పాన్స్ ఏంటో తెలిస్తే షాక్ అవడం ఖాయం..

Google News