‘జవాన్‌’ రెస్పాన్స్ ఏంటో తెలిస్తే షాక్ అవడం ఖాయం..

‘జవాన్‌’ రెస్పాన్స్ ఏంటో తెలిస్తే షాక్ అవడం ఖాయం..

ఒక్కో చిత్రానికి రెస్పాన్స్ అనేది ఒక్కో రకంగా ఉంటుంది. కొన్ని చిత్రాలు అస్సలు బాగోలేవని.. లేదంటే కొన్నీటికి మిశ్రమ స్పందన.. మరికొన్నింటికీ మంచి స్పందన వస్తుంది. అయితే ఒక్క నెగిటివ్ కూడా లేకుండా మూకుమ్మడిగా ఒకటే రకమైన రెస్పాన్స్ అనేది దాదాపు ఏ చిత్రానికి ఉండదనే చెప్పాలి. అలాంటి ట్రెమండ్రస్ రెస్పాన్స్‌ను జవాన్ అందుకుంటోంది. అట్లీ దర్శకత్వంలో షారుఖ్‌ ఖాన్‌, నయనతార జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘జవాన్‌’. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ పాన్‌ ఇండియా చిత్రంలో విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుథ్ రవిచంద్ర సంగీతం అందించాడు. ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు బారీగా పెరిగాయి. ఇప్పటికే ఓవర్సీస్‌తో పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీనిని చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ రివ్యూని ఇస్తున్నారు. చిత్ర కథనం అద్భుతమట. యాక్షన్ సీక్వెన్స్‌ అదిరిపోయాయని ప్రేక్షకులు చెబుతున్నారు. షారుఖ్ నటన అద్భుతంగా ఉందట.

‘జవాన్‌’ రెస్పాన్స్ ఏంటో తెలిస్తే షాక్ అవడం ఖాయం..

‘జవాన్‌’ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఖాయమని ప్రేక్షకులు అంటున్నారు. అట్లీ ఓ అద్భుతమైన కళాఖండాన్ని అందించారట. ఎమోషన్స్‌, మాస్‌ యాక్షన్స్‌తో అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దారట. ఈ ఏడాది షారుఖ్‌ ఖాన్‌దేనని తేల్చేస్తున్నారు. విజయ్‌ సేతుపతి, నయనతార అద్భుతంగా నంటించారు.

జవాన్‌ చూడడం మిస్‌ కావద్దని ఓ నెటిజన్ తెలిపారు. అంచనాలను సినిమా మించిపోయిందట. మాస్ పాన్ ఇండియా మూవీ అంటే ఎలా ఉండాలో అలాంటి సినిమాను అట్లీ ఇచ్చాడట. కింగ్ సైజ్‌డ్ ఎంటర్‌టైనర్ సినిమాను అందించాడు. జవాన్ తప్పకుండా చూడండని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

విజయ్ సేతుపతికి కూడా నటనకు మంచి మార్కులు పడుతున్నారు. ఇక ఈ సినిమాపై ఒక్క ప్రేక్షకుడు కూడా ఒక్క నెగిటివ్ కూడా చెప్పకపోవడం విశేషం.

ఇవీ చదవండి:

మహేష్ – షారుఖ్‌ల మధ్య ఆసక్తికరంగా ట్వీట్స్..

మరోసారి అడ్డంగా దొరికిపోయిన నాగ చైతన్య, శోభితా దూళిపాళ్ల

భోళా శంకర్ దెబ్బకు ఆ సినిమాను హోల్డ్ చేసిన చిరు..!

అనుష్కకు పెళ్లి చేసుకోవాలని ఉందట.. అయితే..

రష్మి కంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు..: సుధీర్ ఎమోషనల్

వామ్మో.. పుష్ప 2 ప్రి రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లా..!