అనుష్కకు పెళ్లి చేసుకోవాలని ఉందట.. అయితే..

అనుష్కకు పెళ్లి చేసుకోవాలని ఉందట.. అయితే..

అనుష్క శెట్టి… అందమే కాదు.. అభినయం కూడా ఎక్కువే. అందుకే స్టార్ హీరోయిన్‌గా ఎదిగేందుకు పెద్దగా సమయం తీసుకోలేదు. దశాబ్దన్నర కాలంగా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ బ్యూటీ ఎందుకోగానీ గత మూడేళ్లుగా పెద్దగా సినిమాలేవీ చేయడం లేదు. తాజాగా మిస్ శెట్టి.. మిసెస్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

నవీన్ పొలిశెట్టి హీరోగా రూపొందిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు మహేష్‌బాబు. పి దర్శకత్వం వహించారు. రొమాంటిక్‌, ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు చాలా రిచ్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కాబోతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉంది.

అనుష్కకు పెళ్లి చేసుకోవాలని ఉందట.. అయితే..

ఇక హీరోయిన్ అనుష్క తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిపై స్పందించింది. తాను సంప్రదాయ వాదినేనని… పెళ్లి, పిల్లలు, కుటుంబం ఇవన్నీ ఉండాలనే అనుకుంటాననని తెలిపింది. తాను పక్కా ఫ్యామిలీ పర్సన్ అని.. ఎమోషనల్ డిపెండెన్సీ కోరుకుంటానని వెల్లడించింది. అయితే తనకు పెళ్లి చేసుకోవాలనే ఉందని కానీ కక్కు వచ్చినా కల్యాణం వచ్చినా ఆగదంటారు కదా.. కాబట్టి టైమ్ రావాలని చెప్పుకొచ్చింది.

ఇవీ చదవండి:

రష్మి కంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు..: సుధీర్ ఎమోషనల్

వామ్మో.. పుష్ప 2 ప్రి రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లా..!

ప్రియురాలిని వివాహమాడిన మహేష్ విట్టా..

ఫ్రీగా ప్రేమ దొరుకుతుంది.. టికెట్ కాదు.. అభిమానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన షారుఖ్..

విజయ్.. Where is Samantha అని అడిగిన నాగ్!

పొలిటికల్ ఎంట్రీపై విశాల్ ఫుల్ క్లారిటీ..

అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్-7.. కంటెస్టెంట్స్ ఎవరంటే..

Google News