భోళా శంకర్ దెబ్బకు ఆ సినిమాను హోల్డ్ చేసిన చిరు..!

భోళా శంకర్ దెబ్బకు ఆ సినిమాను హోల్డ్ చేసిన చిరు..!

మెగాస్టార్ చిరంజీవికి ఈ ఏడాది చేసిన రెండు చిత్రాలు మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. ఒకటి సూపర్ హిట్ అయితే.. మరొకటి డిజాస్టర్‌గా నిలిచింది. కనీసం వీకెండ్‌లో సైతం ఈ చిత్రం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీంతో చిరు వేసుకున్న ప్రణాళికలన్నీ తలకిందులయ్యాయి. ఇక ముందు చేయబోయే చిత్రాలపై భోళా శంకర్ ఎఫెక్ట్ మామూలుగా పడలేదు. 

భోళాశంకర్ మూవీ మంచి హిట్ సాధించి ఉంటే మాత్రం చిరు ఈ పాటికి కళ్యాణ్ కృష్ణ కురసాల సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లి ఉండేవారు. కానీ భోళా శంకర్ డిజాస్టర్ కావడంతో ఆయన కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ కృష్ణ మూవీని హోల్డ్ చేశారు. ఈ సినిమా స్క్రిప్ట్‌ను పూర్తి స్థాయిలో శాటిఫై ఉండేలా మార్పులు చేర్పులు చేస్తున్నారట. ఇవన్నీ పూర్తయ్యాకే ఈ సినిమాను చిరు పట్టాలెక్కిస్తారట.

Advertisement
భోళా శంకర్ దెబ్బకు ఆ సినిమాను హోల్డ్ చేసిన చిరు..!

ఇక తాజాగా చిరు పుట్టిన రోజు సందర్భంగా కూడా ఏ సినిమా ప్రకటనా రాలేదు. ప్రస్తుతం మల్లిడి వేణు అలియాస్ వశిష్ట మూవీ మినహా ఏ సినిమాను కూడా చిరు పట్టాలెక్కించేలా లేరు. యూవీ క్రియేషన్స్ నిర్మించే ఈ సోషియో ఫాంటసీ మూవీకి సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి ప్రి ప్రొడక్షన్ వర్క్స్ స్పీడుగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది.

ఇవీ చదవండి:

అనుష్కకు పెళ్లి చేసుకోవాలని ఉందట.. అయితే..

రష్మి కంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు..: సుధీర్ ఎమోషనల్

వామ్మో.. పుష్ప 2 ప్రి రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లా..!

ప్రియురాలిని వివాహమాడిన మహేష్ విట్టా..

ఫ్రీగా ప్రేమ దొరుకుతుంది.. టికెట్ కాదు.. అభిమానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన షారుఖ్..

విజయ్.. Where is Samantha అని అడిగిన నాగ్!