రష్మి కంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు..: సుధీర్ ఎమోషనల్

రష్మి కంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు..: సుధీర్ ఎమోషనల్

బుల్లితెర లవ్ బర్డ్స్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్ – రష్మీ గౌతమ్. వీరిద్దరూ బీభత్సంగా పాపులర్ అయ్యారు. కొన్నేళ్లుగా వీరిద్దరూ ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. జబర్దస్త్ వేదికగా మొదలైన బంధం ఢీ షోతో మరింత బలపడింది. సుధీర్, రష్మీ కలిసి చేసిన లవ్ ట్రాక్స్, రొమాంటిక్ సాంగ్స్‌కి పెద్ద ఎత్తున ప్రజాదరణ లభించింది.  

వీరిద్దరికీ రెండుసార్లు ఉత్తుత్తి పెళ్లి కూడా జరిగింది. దీంతో వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ తెగ ప్రచారం జరిగింది. వీరిద్దరూ తమ మధ్య ఏమీ లేదంటూ రష్మి, సుధీర్‌లు ఇద్దరూ పలు మార్లు క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక జబర్దస్త్ నుంచి వీరిద్దరూ బయటకు రావడం.. సుధీర్ వెండితెరపై అవకాశాలు దక్కించుకుంటూ ఉండటంతో వీరిద్దరూ జంటగా కనిపించడం మానేశారు.

రష్మి కంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు..: సుధీర్ ఎమోషనల్

తాజాగా సుధీర్, రష్మి ఓ షోలో సందడి చేశారు. ఎప్పటిలాగే ఓ రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేశారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ.. రష్మీతో తనది బ్యూటిఫుల్ జర్నీ అని చెప్పగా.. బ్యూటిఫుల్ జర్నీనా లేక లవ్ జర్నీనా? అని గెటప్ శ్రీను అడిగాడు. దీనిపై సుధీర్ మాట్లాడుతూ.. రష్మీ చాలా కష్టపడే తత్వమున్న అమ్మాయని.. తనకు రష్మీ కంటే ఎవరూ ఎక్కువ కాదన్నాడు. మొత్తానికి ఇద్దరూ చాలా ఎమోషనల్‌గా కనిపించడంతో మళ్లీ వీరిద్దరి ప్రేమ వ్యవహారంపై చర్చ తిరిగి ప్రారంభమైంది.