వామ్మో.. పుష్ప 2 ప్రి రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లా..!

వామ్మో.. పుష్ప 2 ప్రి రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లా..!

‘పుష్ప’ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఇండియా వైడ్‌గా గుర్తింపు వచ్చింది. జాతీయ ఉత్తమ నటుడు అవార్డుతో ఒక్కసారిగా దేశాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలు, కేరళలో మాత్రమే బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. ఇక పుష్ప 2 హిందీలో రికార్డు ఓపెనింగ్స్ ఖాయంగానే కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే మూవీ రైట్స్ కోసం బీభత్సమైన పోటీ ఏర్పడింది. పుష్ప 2 కనీసం షూటింగ్ కూడా పూర్తికాకముందే నిర్మాతలకు వందల కోట్ల లాభం తెచ్చిపెట్టనుందని టాక్ నడుస్తోంది. పుష్ప రైట్స్ ఏకంగా రూ.1000 కోట్లు పలికాయని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇది రికార్డ్ బిజినెస్ అనే చెప్పాలి. విడుదలకు ముందు బడ్జెట్‌కు రెండితలకు పైనే లాభాలను ఈ చిత్రం అందుకుందని టాక్.

Advertisement

పుష్ప 2 బడ్జెట్ దాదాపు రూ.300 కోట్లు కాగా.. ప్రి రిలీజ్ బిజినెస్ ద్వారానే నిర్మాతలకు అదనంగా రూ.700 కోట్లు దక్కనున్నాయట. ఈ ప్రచారం నిజమైతే మాత్రం అల్లు అర్జున్ రేంజ్ ఎక్కడికో వెళ్లినట్టు. పుష్ప 2 చిత్రానికి రూ.80 కోట్లు తీసుకున్న బన్నీ.. ఇక తన చిత్రాలకు ఈ రేంజ్‌లో బిజినెస్ జరిగితే నెక్ట్స్ రెమ్యూనరేషన్ రూ.100 కోట్లు తీసుకోవడం ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బన్నీ ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగురేస్తున్నారు.

ఇవీ చదవండి:

ఫ్రీగా ప్రేమ దొరుకుతుంది.. టికెట్ కాదు.. అభిమానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన షారుఖ్..

విజయ్.. Where is Samantha అని అడిగిన నాగ్!

పొలిటికల్ ఎంట్రీపై విశాల్ ఫుల్ క్లారిటీ..

అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్-7.. కంటెస్టెంట్స్ ఎవరంటే..

ఈ పాత్రకు వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ మాత్రమే..!

ఇండియాలోనే అత్యంత ధనిక నటుడు నాగార్జున!