ఇండియాలోనే అత్యంత ధనిక నటుడు నాగార్జున!

ఇండియాలోనే అత్యంత ధనిక నటుడు నాగార్జున!

అక్కినేని నాగార్జున.. తన 64వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో రాణిస్తున్న నాగ్.. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ కొన్ని సూపర్ హిట్ చిత్రాలను అందించారు.1967 తెలుగు చిత్రం సుడిగుండాలు మూవీతో బాల నటుడిగా తన నట జీవితాన్ని ప్రారంభించిన నాగ్.. 1986లో విక్రమ్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం అంటే 2023 నాటికి నాగ్.. రూ.1000 కోట్లతో ఇండియాలోనే అత్యంత ధనిక నటుడు కావడం గమనార్హం.

నాగార్జునకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా ఆస్తులున్నాయి. వాటిలో మెయిన్ వచ్చేసి.. అన్నపూర్ణ స్టూడియోస్. దీనిని అక్కినేని నాగేశ్వరరావు స్థాపించారు. ఈ స్టూడియో విలువ దాదాపు రూ. 200 కోట్లు! హైదరాబాద్ మధ్యలో 22 ఎకరాల్లో ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ సినిమాల షూటింగ్స్‌కు బాగా ఉపయోగపడుతోంది. బిల్డింగ్ సెట్‌ల నుంచి అవుట్‌డోర్ లొకేషన్‌లు, ఎడిటింగ్, డబ్బింగ్ వంటి వాటన్నింటికీ కేరాఫ్‌గా నిలుస్తోంది.

Advertisement
ఇండియాలోనే అత్యంత ధనిక నటుడు నాగార్జున!

ఇది కాకుండా నాగ్‌కు జూబ్లీహిల్స్‌లో భారీ బంగ్లా, నగరం వెలుపల కొన్ని ఎకరాల వ్యవసాయ భూమి.. హైటెక్ సిటీలో భారీ కన్వెన్షన్ సెంటర్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి నాగ్ ఆస్తుల విలువ రూ.1000 కోట్లకు చేరింది. ఇక నాగార్జున కెరీర్ విషయానికి వస్తే ఆయన తన 99వ చిత్రం ‘నా సామి రంగ’ చిత్రంలో నటిస్తున్నారు. ఇక త్వరలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో సైతం నాగ్ హోస్ట్‌గా మరోసారి సందడి చేయబోతున్నారు.

ఇవీ చదవండి:

‘ఖుషి’ ట్రైలర్ చూసి అక్కడి నుంచి నాగ చైతన్య వెళ్లిపోయాడా?

పవన్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌కి సడెన్ సర్‌ప్రైజ్

నేను ప్రేమించిన అమ్మాయిని దూరం చేసిన ఆ హీరోపై పగ ఇలా తీర్చుకున్నా: విజయ్ సేతుపతి

‘అర్జున్‌రెడ్డి’ కాంబోపై ఇంట్రస్టింగ్ విషయం

‘ఖుషి’ ఎలా ఉంది? ట్విటర్ రివ్యూ పాజిటివా? నెగిటివా?

బిగ్‌బాస్ అవకాశం వచ్చింది.. కానీ..