బిగ్‌బాస్ అవకాశం వచ్చింది.. కానీ..

బిగ్‌బాస్ అవకాశం వచ్చింది.. కానీ..

బిగ్‌బాస్ 7.. మరికొద్ది రోజుల్లో బుల్లితెరపై సందడి చేయనుంది. దీనిలో పాల్గొనబోయే సెలబ్రిటీల లిస్ట్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది కానీ అందులో ఎవరుంటారో ఎవరు ఉండరనేది తెలియడం లేదు. అబ్బాస్, ప్రియాంకజైన్ వంటి వారి పేర్లు వినిపించాయి కానీ వాళ్లెవరూ ఉండరని ప్రస్తుతం టాక్ నడుస్తోంది. ఇక మై విలేజ్ షో అనిల్‌ కూడా బిగ్‌బాస్‌కు వెళుతున్నాడని ప్రచారం జరిగింది.

అయితే అనిల్‌కు నిజంగానే ఆఫర్ వచ్చిందట. 99% పక్కా అన్నారట. కానీ లాస్ట్ మినిట్‌లో రిజెక్ట్ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ ఓ వీడియో ద్వారా వెల్లడించాడు. బిగ్‌బాస్ నుంచి ఆఫర్ రావడంతో ప్రతి ఒక్కరూ వెళ్లాలని చెప్పారట. తనను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారు సైతం మెసేజ్‌ల ద్వారా బిగ్‌బాస్ షోకు వెళ్లాలని సూచించారని తెలిపాడు. తాను కూడా బిగ్‌బాస్ నుంచి ఫోన్ రాగానే చాలా ఎగ్జయిట్ అయ్యానని తెలిపాడు.

అయితే తానొక కథ రాసుకున్నాడట. అన్నీ కుదిరితే సినిమా చేద్దామని అనుకున్నాడట. అయితే బిగ్‌బాస్ ఆఫర్ రావడంతో ఒక సందిగ్దంలోకి వెళ్లిపోయాడట. ఒకవేళ బిగ్‌బాస్‌లోకి వెళితే తనకు నటుడిగా ఆదరణ దక్కుతుందా? లేదా? అని తెగ ఆలోచించాడట. అయితే అందరూ సూచించడంతో ముందు బిగ్‌బాస్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడట. అయితే లాస్ట్ మినిట్‌లో తనను ఎందుకు రిజెక్ట్ చేశారో అర్ధం కావడం లేదన్నాడు. ఇక ఇప్పుడు తన ఫోకస్ మొత్తం సినిమాపైనే పెడతానని అనిల్ తెలిపాడు.

ఇవీ చదవండి:

ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చిరు కోసమా? షాకింగ్ విషయం చెప్పిన అశ్వనీదత్

చెస్ట్‌పై సుధీర్ టాటూతో దర్శనమిచ్చిన రీతూ.. షాక్‌లో రష్మి ఫ్యాన్స్

డ్రగ్స్ కేసులో వరలక్ష్మి ఇరుక్కుందా..నిజమెంత!?

ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్య ఫ్యాన్ వార్..

‘గుంటూరు కారం’ నుంచి డైలాగ్స్ లీక్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

‘జెర్సీ’ తెచ్చిన తంటా.. ఆ సీన్‌ను తొలగించాలంటూ ‘జైలర్’కు కోర్టు ఆదేశాలు..

Google News