‘ఖుషి’ ఎలా ఉంది? ట్విటర్ రివ్యూ పాజిటివా? నెగిటివా?

‘ఖుషి’ ఎలా ఉంది? ట్విటర్ రివ్యూ పాజిటివా? నెగిటివా?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కలిసి నటించిన చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ నేడు థియేటర్లలో సందడి చేస్తోంది. అటు విజయ్ దేవరకొండకు ఇటీవలి కాలంలో హిట్స్ అంటూ ఏమీ లేవు. సమంత పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. ఇక శివ నిర్వాణ.. ఈ ముగ్గురికీ ఈ బొమ్మ హిట్ అవడం అత్యవసరం. మరి ఇప్పటికే యూఎస్‌లో అయితే ప్రీమియర్స్ ముగిశాయి. మరి సినిమాపై టాక్ ఎలా ఉంది?

యూఎస్‌లో ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా రివ్యూ ఇస్తున్నారు. విజయ్ దేవరకొండ నటనకు అయితే మంచి మార్కులు పడుతున్నాయి. ఇక విజయ్ – సమంతల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుందనే టాక్ వినబడుతోంది. సపోర్టింగ్ యాక్టర్స్ కూడా సూపర్బ్ అట. మెయిన్‌గా సాంగ్స్, బీజీఎం అదుర్స్ అట. ఫస్ట్ హాఫ్.. డీసెంట్‌గా ఉందంటున్నారు. కామెడీ కూడా కొంత వరకూ బాగానే ఉందని అంటున్నారు. 

దర్శకుడు స్క్రిప్ట్ ను బాగానే హ్యాండిల్ చేశాడని అంటున్నారు. ఎమోషన్, రొమాంటిక్ సన్నివేశాలు వర్క్ అవుట్ అయ్యాయని అంటున్నారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే.. కథలో కొత్తదనం అంటూ ఏమీ లేదట. సాగదీత చాలా ఎక్కువగా ఉందట. సెకండ్ హాఫ్ అంతగా ఆకట్టుకోలేదని అంటున్నారు. క్లైమాక్స్ మాత్రం బాగుందట. ఇక ఓవరాల్‌గా సినిమా విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ, సమంతల అకౌంట్‌లో హిట్ పడినట్టే అంటున్నారు.

https://twitter.com/chanticomradevd/status/1697432203763110345
https://twitter.com/Rusthum45/status/1697450811041914910
https://twitter.com/ItzSaiKiran/status/1697363018865156189

ఇవీ చదవండి:

బిగ్‌బాస్ అవకాశం వచ్చింది.. కానీ..

ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చిరు కోసమా? షాకింగ్ విషయం చెప్పిన అశ్వనీదత్

చెస్ట్‌పై సుధీర్ టాటూతో దర్శనమిచ్చిన రీతూ.. షాక్‌లో రష్మి ఫ్యాన్స్

డ్రగ్స్ కేసులో వరలక్ష్మి ఇరుక్కుందా..నిజమెంత!?

ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్య ఫ్యాన్ వార్..

‘గుంటూరు కారం’ నుంచి డైలాగ్స్ లీక్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

Google News