డ్రగ్స్ కేసులో వరలక్ష్మి ఇరుక్కుందా..నిజమెంత!?

డ్రగ్స్ కేసులో వరలక్ష్మి ఇరుక్కుందా..నిజమెంత!?

నటి వరలక్ష్మి శరత్ కుమార్‌ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటున్నారా? అంటే ఔననే అనిపిస్తోంది. డ్రగ్స్ కేసులో ఆమెకు కొచ్చి అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఆమె పీఏ ఆదిలింగంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆదిలింగం పెద్ద మొత్తంలో డ్రగ్స్ దందా చేస్తూ.. ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు.  

ఎవరీ అదిలింగం!

Advertisement

ఆసక్తికర విషయం ఏంటంటే.. డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బును ఆదిలింగం సినీ పరిశ్రమలో పెట్టుబడుతున్నాడట. మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆదిలింగం చేసే డ్రగ్స్ వ్యాపారంలో వరలక్ష్మికి కూడా పార్టనర్‌షిప్ ఉందట. మొత్తానికి ఆదిలింగం చేసే వ్యాపారాలన్నింటిలో వరలక్ష్మి సహకారం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తానికి వరలక్ష్మికి ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

కోలీవుడ్ లో ఇదే టాక్..!

వరలక్ష్మి విచారణకు హాజరు కాబోతున్నారన్న టాక్ కోలీవుడ్‌ని ఊపేస్తోంది. ఇప్పటికే కన్నడ సినీ పరిశ్రమకు చెందిన రాగిణి ద్వివేది, సంజనా గల్రాని డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి.. కొన్నాళ్ళు జైలు జీవితం గడిపారు. కాగా.. వరలక్ష్మి ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లో సైతం రాణిస్తోంది. క్రాక్, వీరసింహారెడ్డి చిత్రాల్లో వరలక్ష్మీ తన నటనతో ఆకట్టుకుంది. ఇంకా మరికొన్ని టాలీవుడ్ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు.

డ్రగ్స్ కేసులో వరలక్ష్మి ఇరుక్కుందా..నిజమెంత!?

అబ్బే అదంతా అబద్దమే!

ఐతే.. ఎన్‌ఐఏ విచారణకు సంబంధించి తనకు ఎలాంటి సమన్లు అందలేదన్నారు. ఆదిలింగం అనే వ్యక్తి మూడేళ్ల క్రితం కొద్దికాలం మాత్రమే ఫ్రీలాన్స్‌ మేనేజర్‌గా పని చేశాడన్నారు. ఆ తరువాత అతనితో తనకెలాంటి సంబంధం లేదన్నారు. ‘ఈ వార్తలు నన్ను దిగ్బ్రాంతికి గురి చేశాయి. ఒకవేళ ప్రభుత్వానికి సహకరించాల్సిన అవకాశం వస్తే సంతోషిస్తాను. నిజానిజాలు తెలుసుకోకుండా సెలబ్రిటీలను వార్తలోకి లాగడం నన్ను నిరాశపరిచింది ‘ అని వరలక్ష్మి చెప్పుకొచ్చారు.

ఇవీ చదవండి:

ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్య ఫ్యాన్ వార్..

‘గుంటూరు కారం’ నుంచి డైలాగ్స్ లీక్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

‘జెర్సీ’ తెచ్చిన తంటా.. ఆ సీన్‌ను తొలగించాలంటూ ‘జైలర్’కు కోర్టు ఆదేశాలు..

బిగ్‌బాస్ 7.. షాకింగ్ అప్‌డేట్స్.. షో ఒక్కటే కానీ..

బాయ్‌ఫ్రెండ్ బ్రేకప్.. రోహిణికి నరకం!

అప్పట్లో.. దొంగతనాలు, గంజాయి కూడా తీసుకునేవాడినంటూ షాకిచ్చిన తనికెళ్ల భరణి

విజయ్ దేవరకొండ పెళ్లి ఎప్పుడో చెప్పిన సమంత