విజయ్ దేవరకొండ పెళ్లి ఎప్పుడో చెప్పిన సమంత

విజయ్ దేవరకొండ పెళ్లి ఎప్పుడో చెప్పిన సమంత

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది. దీనికి సంబంధించి ఈ జంట ఇప్పటికే బీభత్సంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రౌడీ హీరోకి సంబంధించిన కొన్ని సీక్రెట్స్‌ను సమంత రివీల్ చేసింది. రియల్ లైఫ్‌లో విజయ్‌ను చూశాక చాలా ఆశ్చర్యానికి గురైందట.

అసలు సినిమాల్లో కనిపించే విజయ్ దేవరకొండకు, అతడి బయట వ్యక్తిత్వానికి చాలా తేడా ఉందని సామ్ చెబుతోంది. విజయ్‌ను చూసిన వారంతా అతను చాలా రెబల్ అనుకుంటారు కానీ సాఫ్ట్ అని తెలిపింది. తొలుత తాను కూడా రెబల్ అనే అనుకునేదట. సెట్స్‌లో విజయ్‌ను చూసిన తర్వాత కానీ అసలు విషయం తెలియలేదట. విజయ్‌కు ఎలాంటి దురలవాట్లూ లేవట.

ప్రతి రోజూ జిమ్ చేస్తాడట. తన సినిమా గురించి తప్ప మరో విషయం పట్టించుకోడట. చాలా క్రమశిక్షణతో ఉంటాడట. ఏదైనా పార్టీకి వచ్చినా కూడా విజయ్ ఒక వైన్ గ్లాస్ పట్టుకుని ఉండాడట. పార్టీ అయిపోయే వరకూ కూడా ఆ ఒక్క వైన్ గ్లాస్‌నే పట్టుకుని తిరుగుతాడని సామ్ తెలిపింది. ఇక విజయ్ పెళ్లిపై సామ్ స్పందించింది. 2-3 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని విజయ్ చెబుతాడు కానీ అతని పెళ్లి వచ్చే ఏడాదేనని సామ్ తెలిపింది.

ఇవీ చదవండి:

వామ్మో.. సమంత పక్కన కూర్చొన్నందుకు అన్ని లక్షలా?

సర్జరీ కోసం అమెరికా వెళ్లిన శర్వా.. ఆందోళనలో ఫ్యాన్స్..

ఒక్క అప్‌డేట్‌తో ప్రభాస్ ఫాన్స్ లో జోష్ పెంచిన శృతి హాసన్

మహేష్ అందుకోవాల్సిన అవార్డ్.. అల్లు అర్జున్ అందుకున్నాడట..!

2022లో విడుదలైన సినిమాలకు 2021 జాతీయ అవార్డులేంటి..?

బన్నీకి నేషనల్ అవార్డ్ ఎలా వచ్చింది..?

మహేశ్, రాజమౌళి కాంబోపై అదిరిపోయే అప్‌డేట్

Google News