Allu Arjun: బన్నీకి నేషనల్ అవార్డ్ ఎలా వచ్చింది..?

బన్నీకి నేషనల్ అవార్డ్ ఎలా వచ్చింది..?

జాతీయ చలన చిత్ర అవార్డుల్లో టాలీవుడ్ నుంచి ఒక ఉత్తమ నటుడి అవార్డు కొట్టడానికి ఏకంగా 69 ఏళ్ల సమయం పట్టింది. టాలీవుడ్ నుంచి ఒక్క ఉత్తమ నటుడి అవార్డు ఎప్పుడొస్తుందా? అని తెలుగు ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేలా చూశారు. చివరకు అది ఇన్నాళ్లకు సాధ్యమైంది. తాజాగా 2021 సంవత్సరానికి ప్రకటించిన జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా మొత్తం 11 కేటగిరీల్లో పురస్కారాలు సొంతం చేసుకుంది. 

ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలవడంతో ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోతున్నారు. పుష్ప సినిమాకు గానూ ఈ అవార్డ్ వచ్చింది. అలాగే పుష్ప సినిమాకు అద్భుతమైన సాంగ్స్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ సైతం అవార్డ్ అందుకోబోతున్నారు. అసలు వీళ్లిద్దరికీ కలిసొచ్చిన అంశాలేంటి? ఈ సినిమాలో పాటలన్నీ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. విదేశాల్లో సైతం ఈ సినిమాలోని పాటలు సంచలనం సృష్టించాయి.

బన్నీకి నేషనల్ అవార్డ్ ఎలా వచ్చింది..?

విదేశీయులు సైతం ఈ పాటలకు రీల్స్ చేశారు. పాటలన్నీ మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘పుష్ప’ సినిమా రిలీజైన తొలి రోజు అయితే మిశ్రమ స్పందన వచ్చింది. రివ్యూలన్నీ సినిమాకు అంత హైప్ ఏమీ ఇవ్వలేదు. కానీ మౌత్ టాక్‌తో సినిమా దూసుకెళ్లింది. వీకెండ్ పూర్తయ్యేసరికి టాక్ మొత్తం మారిపోయింది. ఫలితంగా ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగునే కాదు.. సౌత్‌ ఇండియా మొత్తం సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఇవీ చదవండి:

మహేశ్, రాజమౌళి కాంబోపై అదిరిపోయే అప్‌డేట్

‘జైలర్’ మూవీలో డైలాగ్ రజినీ రియల్ లైఫ్‌లోనిదేనట..

చిరిగిన చొక్కా వేసుకునే చిరు పెళ్లి చేసుకున్నారట..

స్టార్ హీరోతో నిత్యామీనన్ పెళ్లి.. ఇది ఫిక్సేనట..

లావణ్య పేరును తన ఫోన్‌లో వరుణ్ తేజ్ ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా?

Google News