Chiranjeevi: చిరిగిన చొక్కా వేసుకునే చిరు పెళ్లి చేసుకున్నారట..

చిరిగిన చొక్కా వేసుకునే చిరు పెళ్లి చేసుకున్నారట..

జీవితంలో మంచి సక్సెస్ అందుకుంటూ ఓ స్థాయికి ఎదిగిన తర్వాత ఒక్కసారి లైఫ్ వెనక్కి దిరిగి చూసుకుంటే ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఆయన తన కష్టంతో ఒక మెగా సామ్రాజ్యాన్నే నిర్మించారు. ఆ సామ్రాజ్యం నీడలో ఎందరో హీరోలు ఎదిగి స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో మెగాస్టార్ చిరంజీవి కొన్ని విషయాలను మీడియాతో పంచుకుంటున్నారు. 

చిరు.. మెగా పొజిషన్ వచ్చేందుకు ఎన్నో కష్టాలు.. ఇబ్బందులు పడ్డారు. ఇక ఆయన పెళ్లిలో జరిగిన విషయాలన్నీ ఆసక్తికరమే. తాజాగా తన పెళ్లిలో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఆయన మీడియాతో పంచుకున్నారు. ‘తాతయ్య ప్రేమలేఖలు’ అనే సినిమాలో నటిస్తున్న సమయంలోనే ఆయనకు పెళ్లి సెట్ అయ్యింది. 1980 ఫిబ్రవరి 20న చిరంజీవికి సురేఖతో పెళ్లి ముహూర్తాన్ని పెద్దలు ఫిక్స్ చేశారు.

చిరిగిన చొక్కా వేసుకునే చిరు పెళ్లి చేసుకున్నారట..

అయితే ఆ సమయంలో చిరు ఏకంగా 14 సినిమాల్లో నటిస్తున్నారట. బీభత్సమైన బిజీ. చివరకు పెళ్లికి కూడా షూటింగ్ నుంచే వెళ్లారట. అయితే షూటింగ్‌లో ఆయన షర్ట్ చిరిగిందట. ముహూర్తం దగ్గరపడుతోంది. మార్చుకునే సమయం లేక ఆ చిరిగిన చొక్కాను ఒక టవల్‌తో కవర్ చేసుకుని పెళ్లి పీటలపై కూర్చొన్నారట. ప్రస్తుతం చిరు చెప్పిన ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇక చిరు ఆ టైంలో రెమ్యూనరేషన్ ఎంత తీసుకునే వారో తెలుసా? అక్షరాలా.. రూ.1,116.

ఇవీ చదవండి:

స్టార్ హీరోతో నిత్యామీనన్ పెళ్లి.. ఇది ఫిక్సేనట..

లావణ్య పేరును తన ఫోన్‌లో వరుణ్ తేజ్ ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా?

సమంతకు జంట దొరికేసినట్టేనా? ఆ పోస్ట్ అర్థం అదేనా?

చిరు పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌గా విషెస్ చెప్పిన రామ్ చరణ్

మెగాస్టార్ దగ్గరున్న కార్లు.. వాటి ఖరీదెంతో తెలిస్తే..

Google News