మెగాస్టార్ దగ్గరున్న కార్లు.. వాటి ఖరీదెంతో తెలిస్తే..

మెగాస్టార్ దగ్గరున్న కార్లు.. వాటి ఖరీదెంతో తెలిస్తే..

తెలుగు సినీ ప్రపంచంలోనే స్టార్ నటుల్లో ఒకరిగా మెగాస్టార్ చిరంజీవి కీర్తి పొందుతున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఆయనో ఆదర్శం. అలాంటి మెగాస్టార్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. ముఖ్యంగా చిరు బర్త్ డే సందర్భంగా ఆయన వినియోగిస్తున్న కార్లు.. వాటి ధర వంటి విషయాలు మీకోసం అందిస్తున్నాం. చిరుకి విదేశీ కార్లపై మక్కువ ఎక్కువ. ఈ క్రమంలోనే ఆయన బ్రిటన్, జర్మన్ బ్రాండ్ కార్లను కొనుగోలు చేశారు. 

రేంజ్ రోవర్ వోగ్ 

Advertisement

 మెగాస్టార్ గ్యారేజిలో ఉన్న కార్లలో ల్యాండ్ రోవర్ కంపెనీకి రేంజ్ రోవర్ వోగ్ ఒకటి. దీని ధర కోటి రూపాయల పైమాటే. నిజానికి ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న వోగ్ కారు కంటే కూడా పాత వెర్షన్. కానీ దీని ఇంజిన్‌ చాలా శక్తివంతం. 

మెగాస్టార్ దగ్గరున్న కార్లు.. వాటి ఖరీదెంతో తెలిస్తే..

రోల్స్ రాయిస్ ఫాంటమ్ 

రోల్స్ రాయిస్.. ఇది ప్రపంచ మార్కెట్లోనే అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే కంపెనీ. ఈ కంపెనీకి చెందిన ‘ఫాంటమ్’ కారు చిరంజీవి వద్ద ఉంది. రూ.8 కోట్ల విలువైన ఈ కారు అతి తక్కువ మంది వద్దే ఉంటుంది. అలాంటి వారిలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒకరు. ఇక ఈ కారుని చిరంజీవి 53వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కుమారుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. 

టయోటా ల్యాండ్ క్రూయిజర్

టయోటా ల్యాండ్ క్రూయిజర్ కార్లను ఎక్కువగా రాజకీయ నాయకులు వినియోగిస్తారు. ఎందుకంటే ఇది సేఫ్టీ పరంగా అద్భుతం. చిరంజీవి దగ్గర ఈ కార్లు రెండు ఉన్నాయట. దీని ధర కోటి రూపాయల పైమాటే. ఆసక్తికర విషయం ఏంటంటే.. వీటిలో ఒకటి భారతీయ మార్కెట్లో విడుదలకాక ముందే దిగుమతి చేసుకున్నారట.

ఇవీ చదవండి:

సడెన్‌గా తల్లితో కలిసి న్యూయార్క్‌కి సమంత.. కారణమేంటంటే.. 

చిన్న బ్రేక్ తీసుకుని చిటికెలో వచ్చేసిన రామ్ చరణ్

ఆమె నన్ను అసభ్యంగా తాకిందంటూ దుల్కర్ సల్మాన్ సంచలనం..

జబర్దస్త్ సింగర్ కమ్ కమెడియన్‌పై కేసు నమోదు

ఖుషి సినిమాకు సమంత రెమ్యూనరేషన్ ఎంతంటే..?

నిహారిక పర్సనల్ లైఫ్‌పై కామెంట్.. మండిపడ్డ సాయిధరమ్