నిహారిక పర్సనల్ లైఫ్‌పై కామెంట్.. మండిపడ్డ సాయిధరమ్

నిహారిక పర్సనల్ లైఫ్‌పై కామెంట్.. మండిపడ్డ సాయిధరమ్

సాయి ధరమ్ తేజ్‌కు మంచి టైమ్ నడుస్తోంది. ఆయన నటించిన విరూపాక్ష అద్భుతమైన సక్సెస్ సాధించింది. దీని తర్వాత నించిన బ్రో సినిమా కూడా ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్‌లో కలర్స్ స్వాతితో కలిసి నటించాడు. నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వంలో సత్య అనే షార్ట్ ఫిల్మ్‌లో సాయి ధరమ్ నటించాడు. తాజాగా ఈ షార్ట్‌ ఫిల్మ్‌కి సంబంధించిన వీడియో సాంగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ అప్‌డేట్‌పై అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ సక్సెస్ అవ్వాలని కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే మెగా డాటర్ నిహారిక సైతం సాయి ధరమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పింది. అలాగే సాంగ్ చూడాలని ఎంతో ఆతృతగా ఉందని తన కామెంట్‌లో తెలిపింది. అయితే నిహారిక కామెంట్ కింద ఒకరు.. ఆమె వ్యక్తిగత జీవితంపై కామెంట్ పెట్టాడు.

‘ఇలాంటి వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫ్యామిలీ మీద లేకపోయే’ అని నిహారిక విడాకుల విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ కామెంట్ చేశాడు. సందర్భం లేకుండా నిహారిక వ్యక్తిగత జీవితం టార్గెట్ చేసిన నెటిజెన్ మీద సాయి ధరమ్ తేజ్ మండిపడ్డాడు. ఆ కామెంట్ డిలీట్ చేయాలంటూ సాయి ధరమ్ ఫైర్ అయ్యాడు. ఇక సాయి ధరమ్‌కు నెటిజన్ల నుంచి కూడా మద్దతు బాగానే లభిస్తోంది. అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పడం సమంజసమే అంటున్నారు.

ఇవీ చదవండి:

రెమ్యూనరేషన్ తగ్గించుకున్న చిరు?

భార్యతో కలిసి తన చిరకాల కోరికను తీర్చుకున్న రాజమౌళి

తన లవ్ స్టోరీని స్వయంగా చెప్పిన వరుణ్ తేజ్.. ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారంటే..

త్వరలోనే రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలిస్తే..

అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి జెండా ఎగురవేసిన క్లీంకార.. ఫోటో వైరల్

తన ఆరోగ్యం విషయమై మరోసారి ఎమోషనల్ అయిన సమంత..

Google News