తన లవ్ స్టోరీని స్వయంగా చెప్పిన వరుణ్ తేజ్.. ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారంటే..

తన లవ్ స్టోరీని స్వయంగా చెప్పిన వరుణ్ తేజ్.. ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారంటే..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట పెళ్లికి సిద్ధమవుతోంది. అయితే వీరిద్దరి పెళ్లి ఎప్పుడనే ఆసక్తిగా మారింది. ఇప్పుడైతే లేదని జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఏమీ చేయడం లేదు. అలాగే వరుణ్ తేజ్ తన ‘గాంఢీవదారి అర్జున’ మూవీ ప్రమోషన్స్‌లో తెగ బిజీ అయిపోయాడు.

‘గాండీవధారి అర్జున’సినిమా ఆగస్టు 25న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంోలనే చిత్ర యూనిట్ అంతా ప్రమోషన్స్‌లో బిజీబిజీగా కాలం గడిపేస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ తేజ్ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. మరి ఆ రిపోర్టర్ ఊరుకుంటారా? ప్రేమ, పెళ్లి గురించి వివరాలు అడిగారు. తన ప్రేమకు సంబంధించిన పూర్తి వివరాలను వరుణ్ తేజ్ రివీల్ చేశాడు.

Advertisement
Varun Tej, Lavanya Tripathi Engagement

లావణ్యతో తన వివాహమై ఐదేళ్లు గడిచిందని.. చాలా కాలం పాటు స్నేహితులుగా ఉన్న మీదట.. ఇద్దరి అభిప్రాయాలూ కలవడంతో మరో స్టెప్ ముందుకు వేశామని వరుణ్ తేజ్ తెలిపాడు. తన బెస్ట్ ఫ్రెండ్స్‌లో లావణ్య ఒకరని.. ఆమెకు తనే ఫస్ట్ లవ్ ప్రపోజ్ చేశానని వెల్లడించాడు. తర్వాత ఇంట్లో వాళ్లకు చెబితే వాళ్లు కూడా ఒప్పుకున్నారట.

ఇక లావణ్య తను వాడే ఫోన్ సహా ఎన్నో గిప్ట్‌లు ఇచ్చిందని వరుణ్ తేజ్ తెలిపాడు. తను చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుందని.. తనకేం కావాలో ఆమెకు బాగా తెలుసని చెప్పాడు.

అయితే తాను పర్సనల్ విషయాలపై సీక్రెసీ మెయిన్‌టైన్ చేస్తానని.. అందుకే ప్రేమ వ్యవహారం బయటకు తెలియనివ్వలేదని వెల్లడించాడు. ఇక పెళ్లి కూడా నిశ్చితార్థం మాదిరిగానే సింపుల్‌గా చేసుకుంటానని వరుణ్ తేజ్ చెప్పాడు.

ఇవీ చదవండి:

వామ్మో.. ‘గుప్పెడంత మనసు’ జగతి ఫోటోలు చూస్తే షాకవుతారు..

ఇద్దరు హీరోలు నన్ను రాత్రికి రమ్మంటూ వేధించారు: తాప్సీ

చిరుపై నిర్మాత అనిల్ సుంకర సంచలన వ్యాఖ్యలు నిజమేనా ?

చిరంజీవి కూతురు సుస్మితపై మెగా ఫ్యాన్స్ ఫైర్

వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి వాయిదా పడిందట.. కారణం ఏంటంటే..

తన ఆరోగ్యం విషయమై మరోసారి ఎమోషనల్ అయిన సమంత..