చిరుపై నిర్మాత అనిల్ సుంకర సంచలన వ్యాఖ్యలు నిజమేనా ?

చిరుపై నిర్మాత అనిల్ సుంకర సంచలన వ్యాఖ్యలు నిజమేనా ?

మొన్న ఏజెంట్ సినిమాను నిర్మించి బొక్క బోర్లా పడిన అనిల్ సుంకర.. ఆ తరువాత సామజవరగమన సినిమాతో ఒడ్డున పడ్డారు. మళ్లీ మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాను నిర్మించి తీవ్రంగా నష్టపోయారు. ఈ చిత్రం ఆయనను రూ.50 కోట్లకు పైనే ముంచేసే సూచనలున్నాయని ఇండస్ట్రీ టాక్. ఎందుకంటే ఈ చిత్రం తొలి రోజు నుంచి కూడా దారుణమైన వసూళ్లను రాబట్టింది. చిరంజీవి సినిమాకు ఇంతటి దారుణమైన వసూళ్లు అనేవి నిజంగా వండరే.

అంత పెద్ద డిజాస్టర్ అయిన ఆచార్య మొదటి రోజు వసూళ్లతో పోల్చినా కూడా భోళా శంకర్ వసూళ్లు సగం కూడా లేవు. అయితే ఈ అప్పులన్నింటి నుంచి బయటపడేందుకు అనిల్ సుంకర తన ఫామ్ హౌస్‌ను అమ్మేశారంటూ ఒక టాక్.. సినిమా ఫలితంతో సంబంధం లేదు.. తన రెమ్యూనరేషన్ తనకు ఇవ్వాల్సిందేనని మెగాస్టార్ డిమాండ్ చేస్తున్నట్టు మరో టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే మెగాస్టార్‌ను ఉద్దేశించి అనిల్ సుంకర సంచలన వ్యాఖ్యలు చేశారంటూ ఓ మీడియా ఛానల్ కథనం. 

Advertisement
చిరుపై నిర్మాత అనిల్ సుంకర సంచలన వ్యాఖ్యలు నిజమేనా ?

ఎంత పెద్ద సీనియర్ నటుడు అయినా నిర్మాతకు అండగా ఉండాలని.. అప్పుడే నిజమైన హీరోలు అవుతారని.. ఈ విషయంలో సూపర్‌స్టార్ కృష్ణను ఆదర్శంగా తీసుకోవాలని అనిల్ సుంకర అన్నట్లు మీడియా కథనం సారాంశం. అయితే దీనిపై ఆయనను ప్రశ్నించిన వాట్సాప్ చాట్ బయటకు వచ్చింది. అందులో నిజం లేదని.. చిరు ఒక గొప్ప మానవతావాది అని .. త్వరలో చిరుతో మరో సినిమా తీస్తున్నానని అనిల్ సుంకర తెలిపారు. మొత్తానికి ఏది నిజం? ఏది అబద్ధం తెలియక నెటిజన్లు కన్ఫ్యూజన్‌లో ఉండిపోయారు.

ఇవీ చదవండి:

చిరంజీవి కూతురు సుస్మితపై మెగా ఫ్యాన్స్ ఫైర్

లైబ్రరీలో క్లీవేజ్ షోతో కుర్రకారును హడలెత్తించిన పున్నూ..

అసలు నాని ఎవడు.. ? కొంచెం నోటిదూల తగ్గించుకుంటే మంచిదంటూ నెటిజన్ల ఫైర్

ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన విశ్వక్‌సేన్..

వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి వాయిదా పడిందట.. కారణం ఏంటంటే..