ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన విశ్వక్‌సేన్..

ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన విశ్వక్‌సేన్..

హీరో విశ్వక్ సేన్ ఫ్యాన్స్‌కి శుభవార్త చెప్పాడు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. జీవితంలో మరో దశలోకి అడుగు పెట్టబోతున్నట్టు యంగ్ హీరో ఇన్‌స్టా గ్రాంలో పోస్టు పెట్టాడు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే విశ్వక్ సేన్ తన పోస్టు పెళ్లి గురించేనని కచ్చితంగా చెప్పలేదు కానీ సారాంశం మాత్రం అలాగే ఉంది.

ఇంత కాలం తనను అభిమానించిన, ఆదరిస్తున్న అభిమానులకు విశ్వక్ సేన్ ధన్యవాదాలు తెలిపాడు. ‘మీ అందరికీ ఓ ముఖ్య విషయం వెల్లడించాలి. జీవితంలో మరో దశలో అడుగుపెట్టబోతున్నాను’ అని విశ్వక్ సేన్ ఒక నోట్ విడుదల చేశాడు. తానొక కుటుంబాన్ని ప్రారంభించబోతున్నట్టు ప్రత్యేకంగా తెలిపాడు. కుటుంబాన్ని ప్రారంభించబోతున్నా అన్నాడు కాబట్టి ఆ పోస్ట్ పెళ్లి గురించేనని అభిమానులు అనుకుంటున్నారు.

విశ్వక్ మాత్రం వివాహం చేసుకోబోతున్నట్టు నేరుగా అయితే వెల్లడించలేదు. పూర్తి వివరాలు త్వరలో చెబుతానన్నాడు కాబట్టి ఈ విషయంలో క్లారిటి రావాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే ఫ్యాన్స్ విషెస్ చెప్పడం కూడా స్టార్ట్ చేశారు. వెళ్లిపోమాకే చిత్రంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ ఫలక్‌నుమా దాస్ చిత్రంతో మంచి నేమ్ ఫేమ్ సంపాదించాడు. ప్రస్తుతం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఇవీ చదవండి:

అసలు నాని ఎవడు.. ? కొంచెం నోటిదూల తగ్గించుకుంటే మంచిదంటూ నెటిజన్ల ఫైర్

లైబ్రరీలో క్లీవేజ్ షోతో కుర్రకారును హడలెత్తించిన పున్నూ..

ఈ 10 మంది బిగ్‌బాస్ సీజన్ 7లో పక్కా అట..

కట్టప్ప ఇంట విషాదం..

పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొనాలంటూ శ్రీరాపాక సంచలనం..

స్నేహను వార్న్ చేస్తున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..

Google News