ఈ 10 మంది బిగ్‌బాస్ సీజన్ 7లో పక్కా అట..

ఈ 10 మంది బిగ్‌బాస్ సీజన్ 7లో పక్కా అట..

బిగ్ బాస్ తెలుగు 7కి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు షోపై ఆసక్తిని పెంపొందించే మాదిరిగానే ఉన్నాయి. గతంలో మాదిరిగా ఈసారి ఉండదని.. ఈసారి బిగ్‌బాస్ చెప్పినట్టు కంటెస్టెంట్లు ఆడాల్సిందేనని తాజాగా వచ్చిన ప్రోమోలో హోస్ట్ కింగ్ నాగార్జున చెప్పకనే చెప్పారు. షో మొదలు కావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక అయితే పూర్తైంది.

ఇక ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ విషయానికి వస్తే రోజుకొక లీస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియా సెలెబ్రిటీలతో పాటు బుల్లితెర, వెండితెర స్టార్స్ ఈ సీజన్లో భాగం కానున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈసారి అంతా ప్రేక్షకులకు బాగా తెలిసిన కంటెస్టెంట్లే ఉండే అవకాశం ఉంది. ఈ లిస్ట్ లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ యువ సామ్రాట్ పేరు బాగా వినిపిస్తోంది. కామన్ కోటాలో ఈ ఎంపిక జరిగిందట.

ఇక మొగలిరేకులు సీరియల్ ఎంత ఫేమస్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్ ఫేమ్ సాగర్ ఎంట్రీ ఇస్తున్నాడట. అలాగే నవ్య స్వామి, ఈటీవీ ప్రభాకర్, కార్తీక దీపం మోనిత, అమర్ దీప్‌తో పాటు ఆయన భార్య తేజస్విని, సింగర్ మోహన భోగరాజులు కన్ఫర్మ్ అయ్యారని టాక్. ఇంకా వీరితో పాటు దుర్గారావు దంపతులు, యాంకర్ విష్ణుప్రియ, సురేఖా వాణి, ఆమె కూతురు పేర్లు కూడా బాగానే వినిపస్తున్నాయి.

ఇవీ చదవండి:

బిగ్‌బాస్.. లేటెస్ట్ ప్రోమో అదుర్స్.. లాస్ట్‌లో నాగ్ ట్విస్ట్‌..

స్నేహను వార్న్ చేస్తున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..

కట్టప్ప ఇంట విషాదం..

పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొనాలంటూ శ్రీరాపాక సంచలనం..

చడీ చప్పుడు లేకుండా ఎంట్రీ ఇచ్చిన ‘ఆదిపురుష్’

‘భోళా శంకర్’ మూవీ ట్విటర్ రివ్యూ