‘భోళా శంకర్’ మూవీ ట్విటర్ రివ్యూ

Bholaa Shankar Twitter Review

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన మూవీ ఎలా ఉంది? మహతి ఏమైనా మ్యాజిక్ చేశారా? లేదంటే ఊరించి ఉసూరుమనిపించారా? సెంటిమెంట్, కామెడీ అన్నీ వర్కవుట్ అయ్యాయా? మాతృకను మూవీ మరిపించిందా? లేదా? వంటి అంశాలపై ఓ లుక్కేద్దాం. భోళా శంకర్ మూవీ ప్రీమియర్స్ ఇప్పటికే పడిపోయాయి. ఓవర్సీస్ నుంచి సినిమా ఎలా ఉందనే టాక్ ట్విటర్‌లో వచ్చేసింది. 

ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా వేస్ట్ అని కొందరు.. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళితే చూడొచ్చని కొందరు అంటున్నారు. ఇక సినిమాలో ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. అయితే ఫస్ట్ హాఫ్‌లో కామెడీ మాత్రం అదిరిపోయిందట. ఇంట్రో ఓకే.. సాంగ్స్ మాత్రం యావరేజ్ అంటున్నారు. కథలో కొత్తదనం ఏమీ లేదట. రొటీన్ ప్లాట్ అని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్‌లో అయితే ఒరిజినల్‌ను దర్శకుడు మొత్తానికి ఎత్తేశారట.

Bholaa Shankar Twitter Review 2

ఒరిజినల్‌ను ఎత్తేసినా కూడా ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్ బెటరట. సెకండ్ హాఫ్‌లో చిరు తెలంగాణ యాసలో మెప్పించారట. ఖుషీ సీన్ హైలైట్ అట. సెంటిమెంట్ బాగుందట. కంప్లీట్ ఎంటర్‌టైనర్ అని ప్రేక్షకులు అంటున్నారు. బీజీఎం చాలా దారుణంగా ఉందంటున్నారు. చిరు లుక్స్, కీర్తి సురేష్ చాలా బాగున్నారట. తమన్నా కూడా తన నటన, డ్యాన్స్‌తో ఆకట్టుకుందట. మొత్తానికి అంచనాలు లేకుండా వెళితే సినిమాను కాస్త ఎంజాయ్ చేయవచ్చట. ఫైనల్లీ మూవీ యావరేజ్ టాక్ బాగా వినిపిస్తోంది.

భోళా శంకర్ మూవీ పై మీ అభిప్రాయం ?

  • బ్లాక్ బస్టర్ (67%, 2 Votes)
  • ప్లాప్ మూవీ (33%, 1 Votes)
  • హిట్ మూవీ (0%, 0 Votes)
  • యావరేజ్ (0%, 0 Votes)

Total Voters: 3

Loading ... Loading ...

ఇవీ చదవండి:

రష్మి ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటుంది: సుధీర్

‘జైలర్’ మూవీకి రజినీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే..

‘భోళా శంకర్’ చిత్రానికి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

జైలర్ రివ్యూ: టాక్ ఎలా ఉందో తెలుసా..?

ఆ హీరోయిన్‌తో త్వరలోనే విశాల్ పెళ్లి..!

బిగ్‌బాస్ హౌస్‌లో ఆ తల్లీకూతుళ్లు.. ఇక రచ్చ రచ్చే..

Google News