రష్మి ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటుంది: సుధీర్

రష్మి ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటుంది : సుధీర్

బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌-యాంకర్‌ రష్మీ జోడికి ఉన్న క్రేజ్‌ గురించి ఎవరికి తెలియదు చెప్పండి. అసలు బుల్లితెర జంటల్లో వీరిద్దరి జంటకూ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరొకరికి లేదంటే అతిశయోక్తి కాదు. రీల్‌ కపుల్‌గానే కాకుండా సుధీర్‌-రష్మి రియల్‌ కపుల్‌ అయితే చూడాలని చాలా మంది ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఏదైనా స్కిట్‌లో పాల్గొన్నా.. పాటకు డ్యాన్స్ చేసినా కూడా దాని టీఆర్పీ రేటింగ్ ఎక్కడికో వెళ్లిపోతుంది.

అంతలా స్క్రీన్‌మీద మెస్మరైజ్‌ చేస్తారు ఈ జంట. కానీ కొద్దిరోజులుగా ఈ జోడిని తెలుగు ప్రేక్షకులు చాలా మిస్ అవుతున్నారు. సుధీర్ వేరే ప్రాజెక్టుల్లో బిజీ అయిపోవడంతో వీరిద్దరి జోడి అసలు స్క్రీన్‌పై కనిపించడమే లేదు. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి ఒకే స్క్రీన్‌ను షేర్ చేసుకుని ఫ్యాన్స్‌లో ఎక్కడ లేనంత ఉత్సాహాన్ని నింపేశారు. ఆ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమోలో సుధీర్‌ వేసిన డైలాగ్‌లు మళ్లీ వైరల్‌ అవుతున్నాయి. 

సుధీర్, రష్మి మధ్య జరిగిన సంభాషణ హైలైట్‌గా నిలుస్తోంది. ‘మేడం గారు ఎందుకో కొంచెం కోపంగా ఉన్నారు’ అంటూ రష్మీని ఉద్దేశించి సుధీర్‌ కామెంట్‌ చేస్తాడు. ‘నువ్వు వస్తావని ఇన్నాళ్లు ఎదురు చూశాను’ అంటుంది రష్మి. ఆ సమయంలో రష్మి ఇచ్చిన లుక్ హైలైట్. ఆ తరువాత చిరునవ్వు నవ్వుతూ ఇన్ని రోజులు ఎక్కడున్నావని సుధీర్‌ను అడగ్గా.. తాను ఎక్కడున్నా.. రష్మి మాత్రం తన గుండెల్లో ఉంటుందని చెప్పాడు సుధీర్. మొత్తానికి ఈ జోడీ ఫ్యాన్స్‌ని మరోసారి మెస్మరైజ్ చేయనున్నారు.

ఇవీ చదవండి:

‘జైలర్’ మూవీకి రజినీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే..

‘భోళా శంకర్’ చిత్రానికి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

జైలర్ రివ్యూ: టాక్ ఎలా ఉందో తెలుసా..?

ఆ హీరోయిన్‌తో త్వరలోనే విశాల్ పెళ్లి..!

భోళా శంకర్ విడుదల కష్టమేనా? విడుదలపై స్టే ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించిన డిస్ట్రిబ్యూటర్

బిగ్‌బాస్ హౌస్‌లో ఆ తల్లీకూతుళ్లు.. ఇక రచ్చ రచ్చే..

Google News