ఆ హీరోయిన్‌తో త్వరలోనే విశాల్ పెళ్లి..!

ఆ హీరోయిన్‌తో త్వరలోనే విశాల్ పెళ్లి..!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లిస్ట్‌లో హీరో విశాల్ కూడా ఒకడు. విశాల్‌కు ఆ మధ్య హైదరాబాద్ అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. కానీ ఎందుకో ఆ పెళ్లి అక్కడే ఆగిపోయింది. దీంతో విశాల్ పెళ్లి ఎప్పుడా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఓ తమిళ హీరోయిన్‌ను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ బీభత్సంగా టాక్ నడుస్తోంది.  

ప్రముఖ తమిళ హీరోయిన్ లక్ష్మీమీనన్ తో విశాల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ తమిళనాట ప్రచారం జోరుగా సాగుతోంది. సుందర్ పాండియన్ అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన లక్ష్మీ మీనన్ అదిరిపోయే హిట్స్ కొట్టి గోల్డెన్ లెగ్ హీరోయిన్‌గా ముద్ర వేసుకుంది. ఈ అమ్మడి ఖాతాలో కుమ్కీ, జిగర్తాండ, కుట్టిబులి, పాండియనాడు, నాన్ సికపు మన్మన్, కొంబన్ వంటి సూపర్ హిట్ చిత్రాలున్నాయి.

ఆ హీరోయిన్‌తో త్వరలోనే విశాల్ పెళ్లి..!

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. త్వరలోనే విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి మూవీ భోళా శంకర్‌లో ప్రస్తుతం కీర్తి సురేష్ పాత్రను మాతృక అయిన వేదాళంలో లక్ష్మీ మీనన్ పోషించింది. తమిళ ఒరిజినల్ వేదాళంలో అజిత్‌కి చెల్లెలుగా లక్ష్మీ మీననే నటించింది. గత కొంతకాలంగా విశాల్‌, లక్ష్మీమీనన్ ప్రేమలో ఉన్నారట. వీరిద్దరూ ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయని టాక్.

ఇవీ చదవండి:

భోళా శంకర్ విడుదల కష్టమేనా? విడుదలపై స్టే ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించిన డిస్ట్రిబ్యూటర్

బిగ్‌బాస్ హౌస్‌లో ఆ తల్లీకూతుళ్లు.. ఇక రచ్చ రచ్చే..

రఘువరన్‌ చనిపోవడానికి ఆయన భార్య రోహిణియే కారణమట..

రజినీ కంటే దాదాపు మూడింతలు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?