జైలర్ రివ్యూ: టాక్ ఎలా ఉందో తెలుసా..?

జైలర్ రివ్యూ: టాక్ ఎలా ఉందో తెలుసా..?

బీస్ట్ వంటి డిజాస్టర్ సినిమా తరువాత నెల్సన్ కసి మీద తీసిన చిత్రమే జైలర్. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలోనే  జైలర్ సినిమా ప్రి బుకింగ్స్ కుమ్మేశాయి. దేశంలోనే కాకుండా అమెరికాలోనూ అదిరిపోయాయి. ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా? ఇప్పటికే ప్రేక్షకులు ట్విటర్ ద్వారా ఏం చెబుతున్నారో చూద్దాం.

ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, ఇంట్రో సీన్ నెక్ట్స్ లెవెల్ అని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక నెల్సన్ మూవీ అంటే కామెడీ కామన్. ఈ సినిమాలో కామెడీ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయట. డైలాగ్స్, తెలుగు డబ్బింగ్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నాయని టాక్. ఇంట్రవెల్ బ్యాంగ్ అదిరిపోయిందట. ఈ సినిమాతో రజినీకి చాలా కాలంగా హిట్ పడటం లేదని వెలితి తీరిపోతుందని.. బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని చెబుతున్నారు.

Jailer Review

అయితే సెకండాఫ్‌కి సంబంధించిన రివ్యూ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ఒకవేళ సెకండాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ రేంజ్‌లోనే ఉంటే మాత్రం సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ట్విటర్ టాక్. ఫస్ట్ హాఫ్‌లో కమర్షియల్ యాంగిల్స్ అన్నీ సెట్ అయ్యాయట. కమెడియన్ యోగిబాబు తన కామెడీతో బాగా ఆకట్టుకున్నారట. రజినీ, యోగిబాబు మధ్య కామెడీ సీన్స్ సినిమాకే హైలైట్ అంటున్నారు. రజినీ అయితే క్లోజప్ షాట్స్‌లో కుమ్మేశారట. మొత్తానికి సినిమా సూపర్బ్ అని అంటున్నారు.

ఇవీ చదవండి:

రజినీ కంటే దాదాపు మూడింతలు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

గెస్ట్ హౌస్‌కి రమ్మన్నారు.. కమిట్‌మెంట్స్ ఇస్తేనే అవకాశమన్నారు: ‘బేబి’ నటి ఆవేదన

బెంగుళూరులోనే కాదు.. అమెరికాలోనూ రజినీ జైలర్ రికార్డు

ఆంటీ వ్యవహారానికి అనసూయ ఫుల్ స్టాప్ పెట్టిందా? ఆమె మాటల వెనుక మర్మం అదేనా?

రఘువరన్‌ చనిపోవడానికి ఆయన భార్య రోహిణియే కారణమట..

Google News