రఘువరన్‌ చనిపోవడానికి ఆయన భార్య రోహిణియే కారణమట..

రఘువరన్‌ చనిపోవడానికి ఆయన భార్య రోహిణియే కారణమట..

ఏ పాత్రలో అయినా జీవించగల నటులు కొందరే ఉంటారు. వారిలో రఘువరన్ ఒకరు. ఆయన ఇప్పుడు లేరు. అయితే ఇంతకాలానికి ఆయన మరణానికి అసలు కారణం ఏంటో తెలిసింది. నిజానికి మద్యానికి బానిసై ఆయన మరణించారని ఇప్పటి వరకూ నడుస్తున్న టాక్. ఆయన వ్యసనాలను భరించలేకే ఆయనతో విడిపోయినట్టు రఘువరన్ భార్య రోహిణి కూడా పలుమార్లు చెప్పారు.

అయితే రఘువరన్ తమ్ముడి వాదన మాత్రం మరోలా ఉంది. తన సోదరుడి మరణానికి అసలు కారణం రోహిణియే అన్నట్టుగా ఆయన చెప్పారు. అసలు రఘువరన్ తమ్ముడు ఏం చెప్పారంటే.. తన సోదరుడు వ్యక్తిగత కారణాలతో మద్యానికి బానిసై చిన్న వయసులోనే కన్నుమూశాడని చెప్పుకొచ్చారు. చనిపోవడానికి ముందు రఘువరన్ చాలా మానసిక వేదనను అనుభవించారని ఆయన సోదరుడు వెల్లడించారు.

రఘువరన్‌ చనిపోవడానికి ఆయన భార్య రోహిణియే కారణమట..

తాను అన్నయ్యతోనే ఉండేవాడిని అన్నారు. కానీ తన అన్న మరణించిన రోజు తాను బెంగుళూరులో ఉన్నానని.. ఆయనకు ఛాతినొప్పి రావడంతో పనివాళ్లు ఆసుపత్రికి తరలించారని అప్పటికే ఆయన చనిపోయారని వెల్లడించారు.

భార్యతో విబేధాల కారణంగా విడిపోయారని.. కానీ కొడుకు అంటే అన్నయ్యకు ప్రాణమన్నారు. కోర్టు అనుమతి ప్రకారం కేవలం శనివారం మాత్రమే తన వద్దకు వచ్చేవాడన్నారు. కొడుకును చూడగానే ఎంతో సంతోషపడేవాడన్నారు. మళ్ళీ ఆదివారం తిరిగి వెళ్లిపోతుంటే కుమిలిపోయేవాడన్నారు. రఘువరన్‌ను రోహిణి మానసికంగా కృంగదీసిందని ఆయన సోదరుడు వెల్లడించారు.

ఇవీ చదవండి:

రజినీ కంటే దాదాపు మూడింతలు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

గెస్ట్ హౌస్‌కి రమ్మన్నారు.. కమిట్‌మెంట్స్ ఇస్తేనే అవకాశమన్నారు: ‘బేబి’ నటి ఆవేదన

బెంగుళూరులోనే కాదు.. అమెరికాలోనూ రజినీ జైలర్ రికార్డు

ఆంటీ వ్యవహారానికి అనసూయ ఫుల్ స్టాప్ పెట్టిందా? ఆమె మాటల వెనుక మర్మం అదేనా?

మెగాస్టార్ తో హీరోయిన్‌గా కీర్తి సురేష్ తల్లి.. ఆ సినిమా ఏంటో తెలుసా?

హైకోర్టుకు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.. ఎందుకంటే..

Google News