బిగ్‌బాస్ హౌస్‌లో ఆ తల్లీకూతుళ్లు.. ఇక రచ్చ రచ్చే..

బిగ్‌బాస్ హౌస్‌లో ఆ తల్లీకూతుళ్లు.. ఇక రచ్చ రచ్చే..

బిగ్ బాస్ తెలుగు 7కి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రోమోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. దాదాపు ఈ నెలాఖరు నాటికి లేదంటే వచ్చే నెల మొదటి వారంలో షో మొదలు కాబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తైనట్టు టాక్. ఈ క్రమంలోనే ఇప్పటికే కంటెస్టెంట్ల లిస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ లిస్ట్ ఎంతవరకూ నిజమనేది తెలియదు కానీ పక్కాగా ఆ తల్లీకూతుళ్ల ఎంట్రీ మాత్రం ఫిక్స్ అట.

ఇంతకీ ఎవరా తల్లీకూతుళ్లు అంటారా? చాలా మందికి తల్లీకూతుళ్లు అనగానే అర్థమైపోయి ఉంటుంది. సురేఖా వాణి ఆమె కూతురు సుప్రీత అని. సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి చేసే హంగామా అంతా ఇంతా కాదు. పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని డ్యాన్సులు, డ్రింక్ చేయడాలు, పార్టీలు, పబ్‌లు.. అమ్మో వీళ్లిద్దరూ నిజంగా తల్లీకూతుళ్లేనా? అనిపిస్తుంది. ఇక సురేఖావాణికి ఈ మధ్య కాలంలో అవకాశాలు కూడా ఏమీ లేవు.

కేవలం సోషల్ మీడియానే ఆధారం చేసుకున్నారు. అందుకే బిగ్‌బాస్ నిర్వాహకులు అడగ్గానే వీరిద్దరూ అంగీకరించారట. ఇప్పటి వరకూ హౌస్‌లోకి భార్యాభర్తల ఎంట్రీ చూశాం కానీ ఇలా తల్లీకూతుళ్లు ఎంట్రీ చూసింది లేదు. ఈ తల్లీకూతుళ్లకు ఇన్‌స్టాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంది. బిగ్‌బాస్‌తో కావల్సినంత పాపులారిటీ వస్తుంది కాబట్టి దానిని ఆసరాగా చేసుకుని తన కుమార్తెను హీరోయిన్‌ని చేయాలనేది సురేఖావాణి ప్లాన్ అని తెలుస్తోంది.

ఇవీ చదవండి:

రఘువరన్‌ చనిపోవడానికి ఆయన భార్య రోహిణియే కారణమట..

రజినీ కంటే దాదాపు మూడింతలు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

గెస్ట్ హౌస్‌కి రమ్మన్నారు.. కమిట్‌మెంట్స్ ఇస్తేనే అవకాశమన్నారు: ‘బేబి’ నటి ఆవేదన

బెంగుళూరులోనే కాదు.. అమెరికాలోనూ రజినీ జైలర్ రికార్డు

ఆంటీ వ్యవహారానికి అనసూయ ఫుల్ స్టాప్ పెట్టిందా? ఆమె మాటల వెనుక మర్మం అదేనా?

మెగాస్టార్ తో హీరోయిన్‌గా కీర్తి సురేష్ తల్లి.. ఆ సినిమా ఏంటో తెలుసా?