బెంగుళూరులోనే కాదు.. అమెరికాలోనూ రజినీ జైలర్ రికార్డు

బెంగుళూరులోనే కాదు.. అమెరికాలోనూ రజినీ జైలర్ రికార్డు

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన అప్‌డేట్స్ సినిమాను ఓ రేంజ్‌కి తీసుకెళ్లాయి. బెంగుళూరు ప్రాంతంలో రిలీజ్‌కి ముందుగానే కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మూవీ రూ.3 కోట్లకు పైగా వసూలు చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక్కడే కాదు.. అమెరికాలోనూ అదే తీరు. అమెరికాలో ప్రీమియ‌ర్ అడ్వాన్స్ సేల్స్ రికార్డ్ బ్రేక్ చేశాయి. 

ఇప్పటిదాకా షెడ్యూల్ చేసిన 903 షోలకు గాను 75 వేల టికెట్లు అమ్ముడుపోగా ఎల్లుండి ఉదయానికి ఈ నంబర్లు రెట్టింపు అయినా ఆశ్చర్యం లేదని విశ్లేషకుల అంచనా. అటు అమెరికా విషయానికి వస్తే.. 285 స్థానాలు, 690 షోస్ , 30, 201 టికెట్లు అమ్ముడు పోయాయి. 6,63,817 డాల‌ర్లు వ‌చ్చాయి. ఈ రేంజ్ బుకింగ్స్ ఇప్పటి వరకూ ఏ భారతీయ నటుడి సినిమాకూ రాలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Rajinikanth Jailer record in USA

ఇక బెంగుళూరులో కొన్ని మల్టీప్లెక్సులుఒక రిక్లైనర్‌కు 1400 రూపాయలు అమ్ముతున్నా కూడా ఆడియన్స్ డోంట్ కేర్ అని కొనేస్తున్నారు. ఇక కన్నడలో జైలర్ సూపర్ టాక్ సంపాదించుకుంది. బెంగుళూరులో వెయ్యి షోలు దాటిన మూడవ సినిమా ఇదే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే జైలర్ దెబ్బకు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ బుకింగ్స్ కూడా నత్తనడక నడుస్తున్నాయి. గదర్ 2, ఓ మై గాడ్ 2 బుకింగ్స్ కూడా భోళా శంకర్ దారిలోనే పయనిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ఆంటీ వ్యవహారానికి అనసూయ ఫుల్ స్టాప్ పెట్టిందా? ఆమె మాటల వెనుక మర్మం అదేనా?

మెగాస్టార్ తో హీరోయిన్‌గా కీర్తి సురేష్ తల్లి.. ఆ సినిమా ఏంటో తెలుసా?

హైకోర్టుకు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.. ఎందుకంటే..

చిరు ఇంత ఓవరయ్యారేంటి..? నెట్టింట పెద్ద ఎత్తున ట్రోల్స్..

ఓరినాయనో.. బిగ్‌బాస్ హౌస్‌ లోకి వెళ్తున్నది వీళ్ళే.. ఇక రచ్చ రచ్చే..

తనకు పుట్టిన బిడ్డకు గుండెలో రెండు రంధ్రాలున్నాయని తెలిసి తల్లడిల్లిపోయిన స్టార్ హీరోయిన్..