గెస్ట్ హౌస్‌కి రమ్మన్నారు.. కమిట్‌మెంట్స్ ఇస్తేనే అవకాశమన్నారు: ‘బేబి’ నటి ఆవేదన

గెస్ట్ హౌస్‌కి రమ్మన్నారు.. కమిట్‌మెంట్స్ ఇస్తేనే అవకాశమన్నారు: 'బేబి' నటి ఆవేదన

ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలని.. ఆపై నిలదొక్కుకోవాలని ఎంతో మంది నటీనటులు టాలీవుడ్‌లోకి అడుగు పెడుతుంటారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. మరికొందరు మాత్రం ఏవో సైడ్ క్యారెక్టర్స్  ఒకటి, రెండు చేసుకుని సైడ్ అయిపోతుంటారు. ఇక నటీమణులైతే ఈ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలన్నా కమిట్‌మెంట్స్ ఇవ్వక తప్పదు. ఇండస్ట్రీని వేధించే ప్రధాన సమస్యల్లో ఒకటి కాస్టింగ్ కౌచ్.

క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎందరు పెదవి విప్పినా కూడా ఎంత ఓపెన్‌గా కామెంట్స్ చేసినప్పటికీ దానికి అయితే ఫుల్ స్టాప్ పడటం లేదు. చిన్న చిన్న పాత్రలు వేసే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద సినిమాల్లో హీరోయిన్స్ గా నటించే వాళ్లకు కూడా ఈ కాస్టింగ్ కౌచ్ అనుభవాలు తప్పవు. తాజాగా ఈ కాస్టింగ్ కౌచ్ గురించి కిర్రాక్ సీత హాట్ కామెంట్స్ చేసింది. తాజాగా కిర్రాక్ సీత ఓ ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలను వెల్లడించింది. 

బేబి సినిమాలో కిర్రాక్ సీత కీలక పాత్రలో నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి వెల్లడించింది. నిర్మాతలు, డైరెక్టర్లు కొన్ని వల్గర్ మాటలతో వేధించే వారట. తనను గెస్ట్ హైస్‌కి కూడా రమ్మని పిలిచారట. కమిట్‌మెంట్స్ ఇస్తేనే అవకాశం ఇస్తామని తెగేసి చెప్పారట. అలాంటి వాటికి తాను ఒప్పుకోలేదని.. టాలెంట్‌తో వచ్చే అవకాశాల కోసం ఎదురు చూశానని కిర్రాక్ సీత చెప్పుకొచ్చింది.

ఇవీ చదవండి:

బెంగుళూరులోనే కాదు.. అమెరికాలోనూ రజినీ జైలర్ రికార్డు

ఆంటీ వ్యవహారానికి అనసూయ ఫుల్ స్టాప్ పెట్టిందా? ఆమె మాటల వెనుక మర్మం అదేనా?

మెగాస్టార్ తో హీరోయిన్‌గా కీర్తి సురేష్ తల్లి.. ఆ సినిమా ఏంటో తెలుసా?

హైకోర్టుకు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.. ఎందుకంటే..

చిరు ఇంత ఓవరయ్యారేంటి..? నెట్టింట పెద్ద ఎత్తున ట్రోల్స్..

ఓరినాయనో.. బిగ్‌బాస్ హౌస్‌ లోకి వెళ్తున్నది వీళ్ళే.. ఇక రచ్చ రచ్చే..

Google News